Begin typing your search above and press return to search.
ఇంతకీ ‘గ్యారేజ్’లో విలన్ ఎవరు?
By: Tupaki Desk | 25 Aug 2016 3:30 PM GMTఇంకో వారం రోజులే ఉంది ‘జనతా గ్యారేజ్’ విడుదలకు. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ అంచనాలతో.. అత్యంత భారీగా విడుదల కాబోతోందీ సినిమా. కొరటాల మరోసారి కంటెంట్ తో కొడతాడా.. ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ ఎలా ఉంటుంది.. మోహన్ లాల్ చేయగలిగేంత ప్రత్యేకత ఆ పాత్రలో ఏముంది.. ఎన్టీఆర్-లాల్ కాంబినేషన్లో సన్నివేశాలు ఎలా ఉంటాయి.. ట్రైలర్ ఉన్నంత బాగా సినిమా కూడా ఉంటుందా.. అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ట్రైలర్ని బట్టి ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ కథ మీద జనాలకు ఓ అంచనా వచ్చింది. ఐతే ఇంత భారీ సినిమాలో.. ఎన్టీఆర్-మోహన్ లాల్ లాంటి బలమైన హీరోల్ని ఢీకొట్టే విలన్ ఎవరన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
ఈ సినిమాలో మలయాళ యువ నటుడు ముకుందన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ట్రైలర్లో అతణ్ని చూపిస్తారు. మోహన్ లాల్ కొడుకుగా నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడతను. ఐతే అతను మెయిన్ విలన్ కాదు. జాన్ కొక్కెన్ అనే మరో మలయాళ నటుడికీ ఇందులో చోటుంది. అతను కూడా చోటా విలనే. మరి బడా విలన్ ఎవరన్నది మాత్రం స్పష్టత లేదు. ‘జనతా గ్యారేజ్’లో యాక్షన్ కు కూడా బాగానే ప్రాధాన్యం ఉందని.. విలన్ పాత్ర కీలకమని ట్రైలర్ని బట్టి అర్థమవుతోంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే.. హీరో పాత్ర అంత బాగా పండుతుందనేది కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. కొరటాల గత రెండు సినిమాల్లోనూ విలన్ పాత్ర కీలకంగా మారింది. మరి ‘జనతా గ్యారేజ్’లో ఆ బడా విలన్ ఎవరో.. ఆ పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి.