Begin typing your search above and press return to search.

కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఆశించినంత లేవే!

By:  Tupaki Desk   |   10 Jan 2019 12:27 PM GMT
కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఆశించినంత లేవే!
X
'ఎన్టీఆర్ కథానాయకుడు' నిన్న(బుధవారం) నాడు భారీ అంచనాల నడుమ విడుదలయింది. సినిమాకు చేసిన భారీ ప్రమోషన్స్.. ప్రేక్షకుల్లో ఉన్న హైప్ ను బట్టి చూస్తే మొదటి రోజు కలెక్షన్స్ భారీగా ఉంటాయని అందరూ అంచనా వేశారు. సంక్రాంతి సీజన్లో విడుదల కానున్న మొదటి సినిమా కావడంతో మొదటి రోజు భారీ సంఖ్యలో స్క్రీన్స్ కూడా లభించాయి. కానీ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ మాత్రం డల్ గానే ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో 'కథానాయకుడు' మొదటి రోజున రూ. 7.7 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసింది. సినిమా థియేట్రికల్ రైట్స్ విలువను బట్టి చూస్తే ఇవి చాలా నిరాశాజనకమైన కలెక్షన్స్ అని చెప్పాలి. ఇలా అయితే ముందు ముందు సినిమాకు మరింత కష్టమే. రేపు రామ్ చరణ్- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' విడుదల అవుతోంది. ఊరమాస్ సినిమా కావడంతో బీ.. సి సెంటర్లలో పూర్తిగా 'కథానాయకుడు' ను డామినేట్ చేసే అవకాశం ఉంది. చరణ్ సినిమా విడులైన మరుసటి రోజే 'ఎఫ్ 2' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలను తట్టుకుని మంచి కలెక్షన్స్ నమోదు చేయాలంటే 'కథానాయకుడు' టీమ్ ప్రమోషన్స్ లో మరింత జోరు చూపించాలి.

పండగకు మూడు నాలుగు రోజుల ముందుగా విడుదల చేయడంవల్ల ఇలా తక్కువ కలెక్షన్స్ వచ్చి ఉంటాయని.. పండగరోజున కలెక్షన్స్ పికప్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు గానీ ఆ సమయానికి ఇతర సినిమాల నుండి పోటీ కూడా అదేవిధంగా ఉంటుంది. మరి ఈ పరిస్థితిని అధిగమించడానికి 'కథానాయకుడు' టీమ్ ఏం చేస్తుందో వేచి చూడాలి.

ఏపీ.. తెలంగాణా రాష్ట్రాల్లో మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 1.72 cr
సీడెడ్: 0.82 cr
ఉత్తరాంధ్ర: 0.85 cr
ఈస్ట్: 0.41 cr
వెస్ట్: 0.67 cr
కృష్ణ: 0.71 cr
గుంటూరు: 2.01 cr
నెల్లూరు: 0.51 cr

టోటల్: రూ. 7.7 cr షేర్