Begin typing your search above and press return to search.

ప్చ్.. ఓవర్సీస్ లో ప్లాన్ రివర్స్ అయిందే!

By:  Tupaki Desk   |   11 Jan 2019 6:30 AM GMT
ప్చ్.. ఓవర్సీస్ లో ప్లాన్ రివర్స్ అయిందే!
X
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'ఎన్టీఆర్ కథానాయకుడు' బుధవారం నాడు ప్రేక్షకులముందుకు వచ్చింది. అదే ఓవర్సీస్ లో మాత్రం ప్రీమియర్లు మంగళవారం రాత్రే ప్రదర్శించారు. మంగళవారం నాడు అమెరికాలో థియేటర్లు 1+1 టికెట్ ఆఫర్లు ఉంటాయి. పైగా సంక్రాంతి సినిమాలలో మొదటిది కావడం తో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ఇవన్నీ ఎన్టీఆర్ సినిమాకు కలిసి వచ్చి ప్రీమియర్స్ తో వన్ మిలియన్ డాలర్ మార్క్ టచ్ అవుతుందని ఎన్టీఆర్ టీమ్ భావించారు.

కానీ అనుకున్నదొకటి అయినదొకటి అన్న చందంగా సగానికి సగం కూడా కలెక్షన్స్ రాలేదు. బాలకృష్ణ సినిమాలలో ఈ ఓవర్సీస్ కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అయినప్పటికీ 'కథానాయకుడు' సినిమాకు జరిగన ప్రీ-రిలీజ్ ను బట్టి చూస్తే మాత్రం ఇది నిరాశకలిగించేదే. ఇక ఓవర్సీస్ లోనే కాకుండా ఇండియాలో కూడా అలాంటి రెస్పాన్సే వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందనే విషయలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ గురించి అయన గొప్పదనం గురించి ఈ జెనరేషన్ ప్రేక్షకులకు పెద్దగా తెలియదని కొందరి వాదన. బయోపిక్ ఒక పార్ట్ గా వచ్చి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని కూడా అంటున్నారు.

ఇదే కాకుండా ఒక కమ్యూనిటి వారు మరీ ముందుకెళ్ళి ఎన్టీఆర్ ను దేవుడిగా ప్రొజెక్ట్ చేసే వ్యవహారం ఇతరులకు నచ్చలేదని.. ఆయన్ను గొప్ప నటుడిగా.. రాజకీయ నాయకుడిలా చూడమంటే సరేగానీ ఈ 'దేవుడు' తరహా వ్యవహారం కూడా కాస్త బెడిసి కొట్టిందనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనా సినిమాకు మంచి రివ్యూస్.. రేటింగ్స్ వచ్చి కూడా ఇలా కలెక్షన్స్ విషయంలో దెబ్బతినడం ఆశ్చర్యమే.