Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కోసం కోట్ల ఖర్చుతో కోరటాల వేయించిన సెట్!
By: Tupaki Desk | 25 Oct 2021 6:54 AM GMTఎన్టీఆర్ .. కొరటాల కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ .. యువసుధ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొరటాల ఒక పవర్ఫుల్ కథను రెడీ చేశాడు. ఎన్టీఆర్ చెప్పిన మార్పులు .. చేర్పులు చేసిన కొరటాల, బైండ్ స్క్రిప్ట్ తో ఇప్పుడు రెడీగా ఉన్నాడట. ఈ సినిమా కోసం కొన్ని రోజులుగా ఒక భారీ సెట్ వేయిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటికి దగ్గరలోనే ఈ సెట్ వేయించారు. ప్రత్యేకమైన ఈ సెట్ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగు ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు. కీలకమైన సన్నివేశాలు చాలా వరకూ ఈ సెట్ చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా షూటింగుకి అంతరాయం కలగాకుండా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సెట్ ప్రమేయం లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తారట. ఈ సినిమా హైలైట్లలో ఈ సెట్ కూడా ఒకటి అని చెబుతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. గతంలో 'జనతా గ్యారేజ్' సినిమా కూడా చాలా వరకూ సెట్లోనే షూటింగు జరుపుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగును పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆయన ఒక టీవీ షోతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేసిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక కొరటాల 'ఆచార్య' సినిమాను విడుదలకు పంపించడానికి అవసరమైన సన్నాహాలను చేసుకుంటున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగు పనులను పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
'ఆచార్య' సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చరణ్ - పూజ మరో జంటగా నటించడం వలన, సహజంగానే అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కొరటాల సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇంతవరకూ కొరటాలకి అపజయమనేది తెలియదు. ఈ సినిమాతో ఆయన ఖాతాలో మరో హిట్ జాయిన్ కావడం ఖాయమేననేది అభిమానుల మాట.