Begin typing your search above and press return to search.

NTR చంద్రుడి రూపం.. అభిమానులు ఫిదా!

By:  Tupaki Desk   |   5 Feb 2021 11:20 AM IST
NTR చంద్రుడి రూపం.. అభిమానులు ఫిదా!
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌ను ముగించి కెరీర్ 30వ సినిమా సెట్స్ కెళ్లేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే త్రివిక్రమ్ ఈ సినిమాని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే అంత‌కుముందు తార‌క్ అవ‌స‌రం మేర మేకోవ‌ర్ ని ట్రై చేస్తున్నార‌ని తాజా లుక్ చూశాక క్లారిటీ వ‌చ్చేసింది. చాలా కాలం తరువాత నిద్రాణస్థితి నుండి విర‌మించుకుని త్వరలో విడుదల కానున్న రొమాంటిక్ డ్రామా `ఉప్పెన‌` థియేట్రికల్ ట్రైలర్ ను తార‌క్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఆయ‌న‌కు థాంక్స్ చెప్పింది. ఈవెంట్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఛాయాచిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో ఎన్టీఆర్ ఇస్మార్ట్ చంద్రుడిలా మెరిసిపోతున్నారు. ఎంతో ఆహ్లాదకరమైన చిరునవ్వుల‌తో అభిమానుల్ని మైమరచిపోయేలా చేస్తున్నారు. బ్లాక్ ఫార్మల్ షర్ట్ .. బ్లూ డెనిమ్ జీన్స్ లో సింపుల్ గా క‌నిపిస్తున్నా.. అతని ట్రేడ్ మార్క్ గిరజాల జుట్టుతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నార‌.

గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ 30 చిత్రీక‌ర‌ణ వివ‌రాల‌ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే పీరియడ్ యాక్షన్ డ్రామా ఆర్‌.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇంత‌కుముందే దుబాయ్ లో ఫ్యామిలీ వెకేష‌న్ ని ముగించి వ‌చ్చారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఎన్టీఆర్ 30 చిత్రీక‌ర‌ణ‌లో జాయిన్ అవుతార‌ని తెలుస్తోంది.