Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ రెండో కొడుకు పేరేంటో తెలుసా.?

By:  Tupaki Desk   |   4 July 2018 12:06 PM IST
ఎన్టీఆర్ రెండో కొడుకు పేరేంటో తెలుసా.?
X
జూనియర్ ఎన్టీఆర్ ఇంట ఇప్పుడు సందడి నెలకొంది. మొన్నీ మధ్య జూన్ 14న ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ లో మరో పోస్టు చేశారు. ఈ పోస్టు ద్వారా తన చిన్న కుమారుడి పేరును అభిమానులకు వెల్లడించారు.

ఎన్టీఆర్ తన రెండో కొడుకు పేరును సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నోడికి ‘భార్గవరామ్’ అని పేరు పెట్టినట్టు ఎన్టీఆర్ తెలిపారు. నాన్నమ్మ బాసవతారకం పేరు కలిసేలా ఎన్టీఆర్ తన రెండో కొడుకుకు పేరు పెట్టడం విశేషం. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో ఉన్న ఫొటోను ఎన్టీఆర్ అభిమానులతో షేర్ చేశారు. ఈ పేరు పెట్టిన సందర్భంగా ఇంట్లో చిన్న పాటి వేడుకను చేసినట్టు తెలుస్తోంది.

ఇంతకుముందు ఎన్టీఆర్ మరో అరుదైన ఫొటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే.. తమ్ముడిని ఎత్తుకున్న అన్నయ్య అభయ్ రామ్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం రెండో కొడుకు రావడంతో ఎన్టీఆర్ షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చి ఎక్కువగా ఇంట్లోనే సమయం గడుపుతున్నారట..ఇద్దరు వారసులతో ఎంజాయ్ చేస్తూ వారితో సరదాసరదగా గడుపుతున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ అనే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.