Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ని చూసి భయపడాల్సిందే

By:  Tupaki Desk   |   25 March 2017 4:08 PM GMT
ఎన్టీఆర్ ని చూసి భయపడాల్సిందే
X
జూనియర్ ఎన్టీఆర్ ఎంత భయంకరంగా ఉన్నాడో చూస్తున్నారా? యంగ్ టైగర్ చేస్తున్న కొత్త సినిమా లుక్ ఇది అంటే నమ్మగలరా? కేరక్టర్లో వేరియేషన్ చూపించడం అంటే ఏంటో అబ్రివేషన్ చెబుతున్నట్లుగా ఉంది కదూ ఎన్టీఆర్ గెటప్.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్ ఒక గెటప్ ఇది అని తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. అయితే.. గెటప్ విషయం నిజమే అయినా.. ఇక్కడ కనిపిస్తున్నది మాత్రం నిజం కాదు. భయపెట్టే కళ్లు.. గుండు చేసిన లుక్ తో 'జై' కేరక్టర్లో కనిపించనున్నాడట ఎన్టీఆర్. ఇది విలన్ పాత్ర అనే విషయం చెప్పకుండానే తెలిసిపోతోంది కదా. ఈ జై పాత్రతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో భయపెట్టబోతున్నాడో చెప్పేందుకు ఇది జస్ట్ ఎగ్జాంపుల్. అయితే.. ఇది ఎన్టీఆర్ వేసుకున్న మేకప్ కాదు.. జస్ట్ ఓ మాస్క్ మాత్రమే అని తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు కానీ.. అదే వాస్తవం.

హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్ వెల్ రూపొందించిన మాస్క్ ఇది. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రయాలజీకి వర్క్ చేసిన ఈయన.. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేయనున్న జై లవ కుశ టీంతో కలిసి పని చేస్తున్నాడు. జై పాత్రకు సంబంధించిన గెటప్ ను రీసెంట్ గా ఫైనల్ చేయగా.. దాని కోసం సిద్ధం చేసిన మాస్క్ ఇది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/