Begin typing your search above and press return to search.
మహానాయకుడు..ఎందుకీ దాపరికం?
By: Tupaki Desk | 26 Jan 2019 4:50 PM GMTఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ రిజల్ట్ ఊహించని విధంగా షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఒకే కథను రెండు సినిమాలుగా తీయాలన్న ప్లాన్ బెడిసి కొట్టిందన్న మాట ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన `కథానాయకుడు`(పార్ట్ 1) ఊహించని పరాజయం అందుకోవడంతో ఆ ప్రభావం `మహానాయకుడు` (పార్ట్ 2) రిలీజ్ పైనా పడింది. వాస్తవానికి మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తామని ఇదివరకూ అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ లోనూ రిలీజ్ తేదీని ప్రత్యేకంగా హైలైట్ చేశారు.
అయితే తానొకటి తలిస్తే అన్న చందంగా పార్ట్ -1 ఫెయిల్యూర్ ఇప్పుడు మహానాయకుడు పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రిలీజ్ విషయమై సందిగ్ధత నెలకొందిట. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15కు రిలీజ్ వాయిదా పడిందన్న మాటా ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే నేడు రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్ లోనూ రిలీజ్ తేదీని ప్రకటించలేదని అంటున్నారు.
గత కొంతకాలంగా `మహానాయకుడు` వాయిదా వ్యవహారంపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పటికైతే ఫిబ్రవరి 15 ఖాయమేనని యూనిట్ భావిస్తోందంటూ ముచ్చటించుకుంటున్నారు. మరోవైపు వేరొక సందేహం వ్యక్తమవుతోంది. అసలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ రిలీజ్ చేయకపోవడమే శ్రేయస్కరమని టీమ్ భావిస్తోందని, ఆ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా దాచేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు మహానాయకుడు ప్యాచ్ వర్క్ ని పూర్తి చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ ప్యాచ్ వర్క్ లో అవసరం మేర మార్పు చేర్పులు ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే ఒక్క పరాజయం ఎన్ని సమీకరణాల్ని మార్చేస్తుందో ఈ బయోపిక్ ఫలితం తేల్చి చెబుతోంది. బయోపిక్ లు తెరకెక్కిస్తే ఎంతో పకడ్భందీగా ప్లాన్ చేయాల్సి ఉంటుందో ఇదో గుణపాఠం అన్న మాటా క్రిటిక్స్ లో వినిపిస్తోంది.