Begin typing your search above and press return to search.

అటు తగ్గించి ఇటు పెంచేస్తున్న ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   11 March 2017 2:17 PM GMT
అటు తగ్గించి ఇటు పెంచేస్తున్న ఎన్టీఆర్
X
ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలైపోయింది. యంగ్ టైగర్ కూడా ఈ నెల 15 నుంచి షూటింగ్ లో జాయిన్ అయిపోతున్నాడు. ఈ పాటికే జూనియర్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది కానీ.. వర్కవుట్స్ చేసి బరువు తగ్గడం కోసం కొన్ని వారాలను డెడికేట్ చేసేశాడు.

ఇప్పుడు పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిన ఎన్టీఆర్.. మరో నాలుగు రోజుల్లో షూటింగ్ కి సై అనేస్తున్నాడు. నిజానికి టెంపర్ టైంలో సిక్స్ ప్యాక్ తో కనిపించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత మళ్లీ బొద్దుగా మారిపోయాడు. జనతా గ్యారేజ్ లో కూడా లావుగానే కనిపించగా.. ఆ తర్వాత వచ్చిన గ్యాప్ కారణంగా ఇంకాస్త పెరిగినట్లు చెబుతారు సన్నిహితులు. బాబీతో చేయనున్న మూవీలో మూడు కేరక్టర్లు చేస్తుండడంతో.. సైజ్ తగ్గాల్సిందే అని ఫిక్స్ అయిపోయి తగ్గిపోయాడు జూనియర్. అంటే జనతా గ్యారేజ్ తర్వాత బరువు పెరిగి.. మళ్లీ తగ్గిపోయాడన్న మాట. మరోవైపు ఇప్పుడు లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు జూనియర్.

సైజులు తగ్గించి.. హెయిర్ పెంచుతున్న ఎన్టీఆర్.. పొడుగాటి జుట్టు ఉంటే... మూడు పాత్రలకు హెయిర్ స్టైల్ లో వేరియేషన్ చూపించచ్చనే ఉద్దేశ్యంతో ఇలా పెంచాడట. అటు మాటల్లోను.. ఇటు డ్రెసింగ్ లోను.. మరోవైపు హెయిర్ స్టైల్ ను కూడా వేర్వేరుగా చూపించబోతున్నాడు ఎన్టీఆర్. చూస్తుంటే.. బాబీతో చేయబోయే మూవీలో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించేస్తాడేమో అనిపించడం సహజమే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/