Begin typing your search above and press return to search.
నీకు ఆ మాస్క్ తో పనేంటి ఎన్టీఆర్?
By: Tupaki Desk | 26 March 2017 7:04 AM GMTఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా జై లవ కుశ.. ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ గెటప్ అంటూ.. సోషల్ మీడియాలో ఓ మాస్క్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గుండుతో.. భయంకరమైన కళ్లతో ఎన్టీఆర్ మాస్క్ బాగానే భయపెట్టేస్తోంది.
అయితే.. అసలు ఈ మాస్క్ తో ఎన్టీఆర్ కి పనేంటి అన్నదే అసలైన టాపిక్. గతంలో డ్యుయల్ రోల్ సినిమాలు తీసేందుకు ఇలాంటివి వాడేవారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత.. ఒకే ఫ్రేమ్ పై ఎంతమందినైనా చూపించడం సులువైపోవడంతో.. వీటితో పని లేకుండా పోయింది. ఇక రోబో సినిమాలో రజనీ మాస్క్ పెట్టుకుని వేరే ఫైటర్లు ఫైటింగులు చేశారు. డ్యాన్సర్లు డ్యాన్సులు చేశారు. అవన్నీ రజినీ ఖాతాలో వేసి.. సినిమా సూపర్ హిట్ అయేందుకు సాయం చేశారు.
మరిప్పుడు ఎన్టీఆర్ మాస్క్ పెట్టుకుని వేరే స్టంట్ మాష్టర్ సీన్లను చేస్తాడా? అనే డౌట్ రావడం సహజం. కానీ ఫైట్లు.. డ్యాన్సులు.. యాక్టింగ్.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ఎన్టీఆర్ కి వెర్సటైల్ స్టైల్ ఉంది. పైగా తనే కష్టపడ్డం తప్ప.. ఇలాంటివాటిని అసలు ఎంగేజ్ చేయడు. చెయ్యి విరిగి కట్టు కట్టుకుని కూడా.. యాక్షన్ సీక్వెన్స్ లో నటించిన హిస్టరీ ఎన్టీఆర్ ది. మరి ఈ మాస్క్ తో యంగ్ టైగర్ కి పనేంటో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/