Begin typing your search above and press return to search.
కోడలుతో వచ్చిన శాలిని - కన్నీటిపర్యంతం
By: Tupaki Desk | 29 Aug 2018 12:51 PM GMTరోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ మృతదేహంను నార్కట్ పల్లి కామినేని నుండి మెహదీపట్నంలోని ఆయన స్వగృహంకు తీసుకు రావడం జరిగింది. హరికృష్ణను కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రా రాజకీయ నాయకులు - సినీ ప్రముఖులు - బంధువులు - మిత్రులు అంతా కూడా మెహదీపట్నం దారి పట్టారు. హరికృష్ణ రెండవ భార్య - ఎన్టీఆర్ తల్లి అయిన శాలిని కూడా భర్తను కడసారి చూసేందుకు కోడలు లక్ష్మీ ప్రణతితో అక్కడకు చేరుకున్నారు. హరికృష్ణ ఇంట్లోకి వెళ్లే సమయంలోనే ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. కన్నీరు పెట్టుకుంటున్న శాలినిని కోడలు లక్ష్మీ ప్రణతి ఓదార్చుతూ తీసుకు వెళ్లడం అక్కడ ఉన్న వారిని తీవ్రంగా కలచి వేసింది.
హరికృష్ణ రెండవ భార్య అయిన శాలినిని మొదట నందమూరి ఫ్యామిలీ అంగీకరించలేదని - ఆ తర్వాత పిల్లలు పెద్ద వారు అవ్వడంతో కుటుంబం అంతా కలిసి పోయిందని ఆ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవారు చెబుతూ ఉంటారు. మెహదీపట్నంలోని హరికృష్ణ ఇంటికి శాలిని ఇలా ఆయన మృతదేహంను చూసేందుకు రావడం చాలా బాధాకరం అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి కుటుంబంలో నెలకొన్న ఈ విషాదంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నందమూరి అభిమానులు శోకంలో మునిగి పోయారు. నాలుగు ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో జానకి రామ్ చనిపోగా ఇప్పుడు హరికృష్ణ చనిపోవడంతో నందమూరి ఫ్యామిలీకి కోలుకోలేని దెబ్బ తలిగినట్లయ్యింది.