Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ సరసనా? అంటూ కొట్టి పారేసిందిగా!
By: Tupaki Desk | 31 May 2022 3:56 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ రిపీటవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది. బౌండ్ స్క్రిప్టు రెడీ చేసి ప్రీప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారు. ఇది రెగ్యులర్ చిత్రం కాదు. ఆర్.ఆర్.ఆర్ తో పెరిగిన ఇమేజ్ నేపథ్యంలో తారక్ ని పాన్ ఇండియా కథలోనే కొరటాల చూపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఎంపిక చేసుకున్న కథాంశానికి తగ్గట్టే అతడు బహుభాషా స్టార్ల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. కథానాయికల్ని హిందీలో పాపులారిటీ ఉన్న వారినే ఎంపిక చేయాలన్నది అతడి పట్టుదల. ఇంతకుముందే అలియా భట్- కియారా అద్వానీని సంప్రదించారని టాక్ వినిపించింది. కియారా షెడ్యూళ్ల అనుకూలత లేని పక్షంలో అలియా భట్ ఖాయమవ్వొచ్చన్న గుసగుసలు వినిపించాయి. కానీ పెళ్లి తేదీ ఖరారు కావడంతో ఆలియా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత జాన్వీ పేరు వినిపించినా అది కూడా ఖరారు కాలేదు.
పాన్-ఇండియన్ సినిమా కావడంతో ఎన్టీఆర్ సరసన ఒక బాలీవుడ్ బ్యూటీ నటించాలనేది కొరటాల ప్లాన్. అదే క్రమంలో పూజా హెగ్డేని సంప్రదించే వీలుందని టాక్ వినిపిస్తోంది. కానీ పూజా కూడా ఇటీవల వరుస చిత్రాలకు సంతకం చేసింది. కారణం ఏదైనా ఇంకా కథానాయిక ఫిక్స్ అవ్వలేదు. కొరటాల శివ అండ్ టీమ్ దీనిపై సీరియస్ వేట సాగిస్తున్నారు. ఇంతలోనే జూనియర్ ఎన్టీఆర్ సరసన సోనాలి బింద్రే నటించనుందన్న గుసగుస వైరల్ అయ్యింది. దీనిపై సోనాలి తాజాగా స్పందించారు. ఈ విషయం తనకు తెలియదని.. దయచేసి అది నిజమైతే దాని గురించి తనకు చెప్పండి అని అన్నారు. దీని గురించి నాకు ఎటువంటి క్లూ లేదు.. కాబట్టి ఇది ఫేక్ న్యూస్. లేదా ఇది నిజమైన వార్త అయితే నావరకూ ఇంకా చేరలేదు.. అని సోనాలి బింద్రే అన్నారు. ఇది థ్రిల్లర్ లా అనిపించిందని కూడా వ్యాఖ్యానించారు.
జాన్వీ కోసం ట్రై చేసినా కుదరలేదు!
ఎన్టీఆర్ 30 తో అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తుందన్న టాక్ కూడా ఇటీవల వినిపించింది. జాన్వీని కొరటాల సంప్రదించారు. కానీ అట్నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కూడా గుసగుస వినిపించింది. ఇప్పటివరకూ జాన్వీ ఖరారు కాలేదని టాలెంటెడ్ నటి సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించగా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందని కూడా గుసగుస వినిపించింది. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మే నెలలో జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివతో తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. కొరటాల రచన- దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం టీజర్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఎన్టీఆర్ ఆవిష్కరించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ -ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ - హరి కృష్ణ కె నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. సాంకేతికంగా అత్యున్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నారు. మూవీ కాస్టింగ్ టెక్నీషియన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
ప్రశాంత్ నీల్ తో మరో లెవల్లో
ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో తారక్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అతడు తన స్టార్ డమ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే రేసులో ప్రభాస్ - రామ్ చరణ్ - బన్ని ఉన్నారు. అందరితో పోటీపడుతూ సత్తా చాటాల్సి ఉంటుంది. నటన డ్యాన్సులు ఛరిష్మా పరంగా పై ఎవరికీ తీసిపోని యంగ్ టైగర్ హిందీ మార్కెట్లోనూ పాగా వేయాలని చూస్తున్నాడు. తదుపరి ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా చిత్రం లుక్ కూడా విడుదల కాగా దానికి అద్భుత స్పంద వచ్చింది. ప్రశాంత్ నీల్ తో అతడు భారీ మాస్ యాక్షన్ డ్రామా చేయనున్నాడని .. తారక్ లుక్ రగ్గ్ డ్ గా ఉంటుందని పోస్టర్ వెల్లడించింది.
త్రివిక్రమ్ తో క్యాన్సిల్ కాలేదు
నిజానికి కొరటాల కంటే ముందే త్రివిక్రమ్ తో తారక్ సినిమా చేయాల్సింది. ప్రాజెక్ట్ ఇక ముందుకెళ్లిపోవడమేనని అంతా వేచి చూస్తున్న సమయంలో మిడిల్ డ్రాప్ అయ్యారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని హీరోకి దర్శకుడికి మధ్య సింక్ కుదరలేదని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి పర్మినెంట్ కాదు. టెంపరరీ మాత్రమేనని నిరూపిస్తూ ఇప్పుడు తారక్ తో త్రివిక్రమ్ కలిసిపోయారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల్లో దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. ఇది ఆసక్తికర పరిణామం అన్న చర్చా సాగుతోంది.
బర్త్ డే రోజున ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలపడం ద్వారా త్రివిక్రమ్ తమ మధ్య విభేదాలను తొలగించారు. ఇప్పుడు త్రివిక్రమ్- ఎన్టీఆర్ మధ్య అంతా బాగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. తదుపరి ఈ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది.