Begin typing your search above and press return to search.
షేర్ తో సింహాద్రి స్క్రీన్ పంచుకుంటే!!!
By: Tupaki Desk | 14 Oct 2015 3:58 AM GMTసుకుమార్ తో నాన్నకు ప్రేమతో చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఏంటి ? ఈ విషయంపై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. శ్రీమంతుడుతో సూపర్ సక్సెస్ సాధించిన కొరటాలతో చేస్తున్నాడని ఓసారి, వక్కంతం వంశీకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడని ఇంకోసారి, కోనవెంకట్ - అబ్బూరి రవి - ఆకుల శివ.. బ్రహ్మాండమైన స్టోరీ లైన్స్ వినిపించారని వార్తలొచ్చాయి. వీటిలో దేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో ఎన్టీఆర్ మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.
అయితే.. ఇప్పుడో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకొచ్చింది. అన్న కళ్యాణ్ రామ్ తో మూవీ చేసేందుకు ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపుతున్నాడట. అదేంటీ.. నెక్ట్స్ వెంచర్ కి ప్రొడ్యూసర్ గా కళ్యామ్ రామ్ ని ఫైనల్ చేశారుగా అనుకోకండి.. ఇక్కడ చెబ్తున్నది అన్నతో కలిసి తమ్ముడు సినిమాలో నటిస్తాడని. అవునండీ.. కళ్యాణ్ రామ్ కలిసి స్క్రీన్ పంచుకోవాలని ఆలోచిస్తున్నాడట ఎన్టీఆర్. ఇందుకు తగినట్లుగా స్టోరీ చెప్పాలని డైరెక్టర్స్ - రైటర్స్ కి సూచిస్తున్నాడట.
ఈ తరం నందమూరి వారసుల నుంచి ఇప్పటివరకూ మల్టీస్టారర్స్ రాలేదు. అందుకు బీజం వేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో రిలీజ్ అవడానికి దాదాపు 3 నెలల టైం ఉంది. ఈలోగా కరెక్ట్ స్టోరీ దొరికితే మాత్రం.. నెక్ట్స్ యంగ్ టైగర్ చేసేది మల్టీ స్టారరే కావచ్చని తెలుస్తోంది.