Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బుకింగ్ లు మొదలయిపోయాయ్

By:  Tupaki Desk   |   9 Jan 2016 3:11 PM GMT
ఎన్టీఆర్ బుకింగ్ లు మొదలయిపోయాయ్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ నాన్నకు ప్రేమతో చిత్రం హడావిడి మొదలయిపోయింది. ఇంకా సెన్సార్ పూర్తి కాకపోవడంతో.. మల్టీప్లెక్స్ ల బుకింగ్ ప్రారంభించే అవకాశం లేదు కానీ.. సాధారణ థియేటర్లలో మాత్రం దాదాపుగా బుకింగ్స్ స్టార్ట్ చేసేశారు.

సాధారణంగా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చాక కానీ... బుకింగ్ మొదలుపెట్టని బుక్ మై షో లాంటి సైట్లలో కూడా నాన్నకు ప్రేమతో టికెట్ సేల్స్ ప్రారంభమైపోయాయి. రిలీజ్ కి ఐదు రోజుల ముందే బుకింగ్ మొదలుపెట్టినా.. సంక్రాంతి పండుగ రష్ అపుడే కనిపిస్తోంది. టికెట్స్ ఆఫర్ చేసిన థియేటర్లన్నీ.. రిలీజ్ రోజుకు అపుడే ఫుల్స్ కనిపిస్తుండడం విశేషం. ముఖ్యంగా.. మెయిన్ థియేటర్స్ అయితే.. అసలు దొరికే ఛాన్స్ కూడా ఉండడం లేదు. ఇక సండే నాటికి మల్టీప్లెక్సులు మినహాయించి.. ఆల్ మోస్ట్ అన్ని థియేటర్స్ కి టికెట్ల అమ్మకాలు మొదలుకానుంది. మల్టీప్లెక్సుల్లో విక్రయాలకు మాత్రం సెన్సార్ వరకూ ఆగాల్సిందేనేమో. ఇప్పుడు టికెట్ దొరకని వాళ్లంతా.. వాటిల్లో ఓపెనింగ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. జనవరి 13న బుధవారం నాడు రిలీజ్ అవుతున్నా.. పండుగ సెలవలు కావడంతో నాన్నకు ప్రేమతో మూవీకి క్రేజ్ ఎక్కువగానే ఉంది.

మరోవైపు జనవరి 14న రిలీజ్ కానున్న డిక్టేటర్, 15న విడుదలవుతున్న సోగ్గాడే చిన్ని నాయనకు కేటాయించిన థియేటర్లలో కూడా.. 13న నాన్నకు ప్రేమతో ప్రదర్శించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పెంచిన టికెట్ రేట్ల కారణంగా.. రిలీజ్ రోజు రికార్డులను ఎన్టీఆర్ బ్రేక్ చేసేట్టుగానే కనిపిస్తున్నాడు.