Begin typing your search above and press return to search.

యూఎస్ బయ్యర్లకు ఎన్టీఆర్ టెన్షన్

By:  Tupaki Desk   |   13 Dec 2015 11:30 AM GMT
యూఎస్ బయ్యర్లకు ఎన్టీఆర్ టెన్షన్
X
రీసెంట్ గా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టేయడంతో డిస్ట్రిబ్యూటర్లకు బెంగ పెరిగిపోతోంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఎక్కువ అలర్ట్ గా ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ విషయంలో టాక్ తో పాటు రిలీజ్ డేట్ టెన్షన్ కూడా ఎక్కువవుతోంది.

సాధారణంగా టాలీవుడ్ సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతాయి. అమెరికాలో వీటి ప్రీమియర్లను గురువారం రాత్రికి ప్రదర్శిస్తుంటారు. శుక్రవారం హాలిడే ఉన్నా.. అంచనాలున్న సినిమాలకు ప్రీమియర్ షోల ద్వారా వసూళ్లు బాగానే వస్తుంటాయి. ఆ రోజు టాక్ పై ఆధారపడి వీకెండ్ మూడు రోజులు కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ డేట్ టెన్షన్ ఎక్కువవుతోంది.

నాన్నకు ప్రేమతో మూవీ జనవరి 13న రిలీజ్ అవుతోంది. అంటే జనవరి 12నే ప్రీమియర్స్ పడాల్సి ఉంటుంది. ఆ రోజు మంగళవారమే కావడంతో.. వసూళ్లు ఎలా ఉంటాయో అని మథన పడుతున్నారు. సంక్రాంతి పండుగ సెలవు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇది పర్ఫెక్ట్ డేట్ అయినా.. యూఎస్ లో మాత్రం.. ఇవి వర్కింగ్ డేస్. టాక్ లో కొంచెం తేడా వచ్చినా ఆ ప్రభావం వీకెండ్స్ పై గట్టిగానే ఉంటుంది. మరోవైపు బాలయ్య డిక్టేటర్ - నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన - శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా మూవీలు కూడా ఎన్టీఆర్ సినిమాపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

ఇంతకుముందు ఇదే సమస్య అక్కినేని అఖిల్ లాంఛింగ్ మూవీ అఖిల్ కి కూడా ఎదురైంది. ఆ సినిమా ప్రీమియర్ కూడా మంగళవారమే పడ్డంతో.. వీకెండ్స్ బాగా డల్ అయిపోయాయి. ఇప్పుడు నాన్నకు ప్రేమతో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోనుండడంతో.. డిస్ట్రిబ్యూటర్లకు బెంగ ఎక్కువయిపోతోంది. ఒకవేళ సినిమా సూపర్‌ హిట్‌ అయిపోతే మాత్రం.. అప్పుడు ఏ గొడవా ఉండదు.