Begin typing your search above and press return to search.
సింపథీ వద్దు.. సునామీ కావాలి
By: Tupaki Desk | 9 Jan 2016 3:59 AM GMTయంగ్ టైగర్ మూవీ నాన్నకు ప్రేమతో సంక్రాంతి రిలీజ్ అని ఇన్నాళ్లూ చెప్పినా.. ఇప్పుడు జనవరి 13న విడుదల అంటూ పోస్టర్లు కూడా వేయడంతో ఫైనల్ అయింది. అయితే.. భారీ పోటీ మధ్య ఈ మూవీ రిలీజ్ కానుండడంతో.. ఎన్టీఆర్ ఈసారైనా భారీ హిట్ కొట్టగలడో లేదో అనుకుంటున్నారు చాలామంది.
ఇప్పటివరకూ 50 కోట్ల షేర్ వసూళ్ల మార్క్ ను అందుకోలేకపోవడం.. ఎన్టీఆర్ ను కూడా నిరుత్సాహ పరిచే విషయమే. ఈసారైనా భారీ బ్లాక్ బస్టర్ సాధించి, అభిమానుల ఆకలి తీరుస్తాడని అనుకుంటే.. ఇప్పుడు థియేటర్ల కొరత కూడా పలకరిస్తోంది. ఒక వైపు బాలకృష్ణ డిక్టేటర్ - మరోవైపు నాగ్ సోగ్గాడే చిన్ని నాయన.. ఈ రెండు భారీ చిత్రాలకు తోడు - మరో రెండు మూవీస్.. వీటన్నిటి కంటే ఒకరోజు ముందే వస్తున్నాడు ఎన్టీఆర్. ఇన్ని అడ్డంకులున్నా.. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే.. 50 కోట్లను దాటడం ఎన్టీఆర్ కు అంత కష్టమేం కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్.
ఈనెల 13నే నాన్నకు ప్రేమతో రిలీజ్ కానుండడంతో.. దాదాపు రిలీజ్ రోజునే 12-14 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. ఎలాగూ రెండో రోజు నుంచి వీకెండ్స్ ముగిసే వరకూ లెక్క 10లోపే ఉంటుంది కాబట్టి.. ఈ పోటీ ఎన్టీఆర్ కు చేసే నష్టమేం లేదంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ కు ఎవరి సింపథీ అవసరం లేదని.. కలెక్షన్ల సునామీ మాత్రమే కావాలన్నది అభిమానుల కోరిక. ఈ రకంగా చూస్తే.. ఈసారి పెద్ద లెక్కలేసుకున్నాకే.. జూనియర్ రంగంలోకి దిగుతున్నట్లుగా ఉంది.