Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ న్యూ లుక్ ఫిక్సయ్యిందట!
By: Tupaki Desk | 23 Dec 2016 1:30 PMమొన్నటికిమొన్న ఎన్టీఆర్ ఫుల్లు గెడ్డంతో ఉన్నాడంటూ నానా హడావుడి చేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ లుక్ అది కాదంటూ మనం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో మొదలవ్వబోయే బాబీ డైరక్షన్లో సినిమా కోసం అసలు ఎలాంటి కసరత్తులు చేస్తున్నాడు యంగ్ టైగర్? ఓ రకంగా చూస్తే ఇంకా ఎటువంటి ప్రిపరేషన్ చేయట్లేదనే చెప్పాలి.
అదిగో ఈరోజు ఉదయం తన సొంతపని మీద ఒక ప్రైవేట్ జెట్ లో రాజమండ్రి వచ్చాడు ఎన్టీఆర్. తన వైఫ్ తో కలసి అక్కడికి చేరుకున్నాడు. కాస్త మాసిన గెడ్డం.. న్యాచురల్ గా ఉన్న తన జుట్టు.. అలాగే కొంచెం పైకొచ్చిన అబ్డామెన్ తో అక్కడ దర్శనమిచ్చాడు. అంటే ఇంకా తన కొత్త సినిమా కోసం ఎటువంటి కసరత్తులూ మొదలెట్టలేదని మనం అర్ధం చేసుకోవచ్చు. పైగా ఎన్టీఆర్ ఇలా ఉన్నాడూ అలా ఉన్నాడూ అంటూ వస్తున్న రూమర్లకు కూడా ఇప్పుడు మనోడు చెక్ పెట్టేసినట్లే.
కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్లో బాబీ డైరక్షన్లో రూపొందే సినిమాకు ఇంకా టైముంది. సంక్రాంతి తరువాత ముహూర్తం ఈవెంట్ జరిగినా కూడా సినిమా షూటింగ్ మాత్రం ఫిబ్రవరి నుండి మొదలెడుతున్నారట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మరోసారి తన లుక్కుతో ప్రయోగం చేస్తాడని టాక్ ఉంది. చూద్దాం ఏం చేస్తాడో.