Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ రచ్చ షురూ!!
By: Tupaki Desk | 4 Oct 2018 9:16 AM GMTసరిగ్గా వారం రోజుల్లో విడుదల కాబోతున్న అరవింద సమేత వీర రాఘవ మెల్లగా వేడిని పెంచుతోంది. కావాల్సినంత హైప్ ప్రీ రిలీజ్ తో పాటు ట్రైలర్ తో వచ్చేసినా ఇంకా కావాలంటున్నారు అభిమానులు. అందుకే వాళ్ళను సంతృప్తి పరచడం కోసం ఒక్కొక్క అస్త్రాన్ని బయటికి తీస్తోంది యూనిట్. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 4.50 నిమిషాలకు ఆడియో లో మొదటగా విడుదలై ఇన్స్ టాంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన అనగనగా పాట వీడియో బైట్ ప్రోమోను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించింది యూనిట్.
అందులో భాగంగా వదిలిన పోస్టర్ లో తారక్ విదేశీ డాన్సర్ల మధ్య స్టైలిష్ గా జేబులో చేయి పెట్టుకుంటూ వేసిన స్టెప్ చూస్తుంటే రచ్చ మాములుగా ఉండేలా లేదు. ఇలాంటి సిగ్నేచర్ స్టెప్ తో గతంలో నాన్నకు ప్రేమతోలో ఐ వానా ఫాలో యు అంటూ రచ్చ చేసిన తారక్ అంతకు రెట్టింపు అల్లరి చేసుంటాడనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.
ఈ పాట వీడియో నిమిషం దాకా ఉండొచ్చని టాక్. కేవలం నాలుగు పాటలే ఉన్నాయని కాస్త నిరాశలో ఉన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ఇది మంచి బూస్ట్ ఇవ్వొచ్చు. రెడ్డి ఇటు చూడు పాటలో తప్ప మిగిలిన వాటిలో డాన్స్ కు అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో ఇప్పుడీ పోస్టర్ ద్వారా ఇందులో కూడా అదిరిపోయే మూమెంట్స్ ఉన్నాయని భరోసా దొరికేసింది. అందుకే ఐదుకు పది నిముషాలు తక్కువ గడియారం ముల్లు ఎప్పుడు రీచ్ అవుతుందాని ఫ్యాన్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. అక్టోబర్ 11న భారీ ఎత్తున విడుదల కానున్న అరవింద సమేత వీర రాఘవ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తారక్ మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకుల అంచనాలు కూడా మాములుగా లేవు. వీడియో ప్రోమోతో ఇవి ఇంకాస్త ఎగబాకడం ఖాయం.