Begin typing your search above and press return to search.

తారక్ డ్యూయల్ సిమ్ కాదా?

By:  Tupaki Desk   |   5 Oct 2018 12:48 PM GMT
తారక్ డ్యూయల్ సిమ్ కాదా?
X
అరవింద సమేత వీర రాఘవ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఇంకో ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ లోపు అభిమానుల అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. నిన్న అనగనగా పాట వీడియో ప్రోమో విడుదల చేసిన టీమ్ రేపు బాగా పాపులర్ అయిన పెనివిటి ని రిలీజ్ చేయబోతోంది. వీక్ ఎండ్ నుంచి మీడియా ప్రమోషన్ ను ఉదృతం చేయబోతున్నారు. ట్రైలర్ చూసాక అందరిలో మెదిలిన అనుమానం ఒకటుంది. అదే యంగ్ టైగర్ సింగల్ రోల్ చేశాడా లేక ద్విపాత్రాభినయంతో అదరగొట్టడా అని.

దానికి కారణం లేకపోలేదు. ట్రైలర్ లో ఓ పెద్దావిడ తారక్ కు వంశ చరిత్ర చెబుతూ తాత కత్తి పట్టడం మొదలుకుని తరతరాలుగా దాని ప్రభావం ఎలా ఉందో వివరించే సీన్ లో పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ వస్తుందనే ఊహాగానాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. కానీ నిజానికి ఇందులో తారక్ ఒక్క పాత్రే ఉంటుందట. కాకపోతే రెండు వేరియేషన్స్ లో కనిపిస్తాడని వినికిడి.

ఫస్ట్ హాఫ్ లో అరవింద ప్రేమలో పడటంతో సరదాగా మొదలై ఆ తర్వాత తన వెనుక ఉన్న దారుణమైన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని దాచి పెట్టిన రాఘవ అలియాస్ వీరరాఘవ రెడ్డికి పూజా తన కుటుంబం గురించి చెప్పడంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుందని తెలిసింది.

టైటిల్స్ కన్నా ముందే పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఆ తర్వాత మళ్ళి ఇంటర్వెల్ లో హీరోయిజంని పీక్స్ లో చూపెట్టాడట. అక్కడి నుంచి సీమ గ్రామానికి షిఫ్ట్ అయిపోయి తారక్ తండ్రి నాగబాబుకి ఊరిలో ఉన్న ప్రత్యర్థి జగపతి బాబుకి మధ్య శత్రుత్వం ఎలా వచ్చింది దాని కారణంగా ఎన్ని ప్రాణాలు పోయాయి శాంతి కోసం రాఘవ చేసిన ప్రయత్నాలు ఏంటి ఎందుకు అంత ఊచకోతకు రాఘవరెడ్డి తలపడాల్సి వచ్చింది ఇవన్నీ అందులో భాగంగానే ఉంటాయట. మొత్తానికి హై వోల్టేజ్ యాక్షన్ గ్యారెంటీ ఇస్తున్న అరవింద సమేత వీర రాఘవ రోజురోజుకి అంచనాలు రెట్టింపు చేసుకుంటూనే ఉంది.