Begin typing your search above and press return to search.
'ఎన్టీఆర్' ను చూశాడా? లేదా?
By: Tupaki Desk | 17 Jan 2019 12:25 PM GMTబాలకృష్ట ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించి, నిర్మించిన 'ఎన్టీఆర్' బయోపిక్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుండే మంచి టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులతో పాటు, సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ పై జనాలు ఆసక్తి చూపడం లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఈ సినిమాపై ఎన్టీఆర్ స్పందించక పోవడం మరింత చర్చకు తెర లేపుతోంది.
మహేష్ బాబుతో పాటు పలువురు స్టార్స్ 'ఎన్టీఆర్' సినిమాపై తమ అభిప్రాయంను వ్యక్తం చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు సినిమా గురించి తన సోషల్ మీడియా పేజ్ లో కాని, మీడియా ముందు కాని చెప్పలేదు. దాంతో కొందరు ఎన్టీఆర్ 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాను చూశాడా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమా చూసి ఉంటాడు. ఎందుకంటే తాత గారిపై ఉన్న అభిమానం ఎన్టీఆర్ ను సినిమా చూడకుండా ఉండనివ్వదు.
'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా చూసి ఉంటాడు కాని, తమ సినిమాపై తామే స్పందిస్తే బాగోదనుకుని మౌనంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. మొత్తానికి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కలెక్షన్స్ విషయంలో పడి ఈ చిత్రంపై ఎన్టీఆర్ కామెంట్ చేయలేదేనే విషయాన్ని నందమూరి అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదనిపిస్తోంది. బయటకు చెప్పకున్నా బాబాయికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పే ఉంటాడనేది కొందరు అభిమానులు అనుకుంటున్నారు.