Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు కాగ్ షోకాజ్ నోటీసులు?
By: Tupaki Desk | 5 Aug 2017 8:20 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కాగ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నాన్నకు ప్రేమతో సినిమా రెమ్యున్ రేషన్ విషయంలో ఎన్టీఆర్ రూల్స్ కు వ్యతిరేకంగా పన్ను మినహాయింపు పొందినట్లుగా ఆరోపణలు రావడంతో కాగ్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎన్టీఆర్ కు ఇచ్చిన పన్ను మినహాయింపును కాగ్ తప్పు పట్టింది. దీంతో ఎన్టీఆర్ కు నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
నాన్నకు ప్రేమతో సినిమాకు గానూ ఎన్టీఆర్ 7.33 కోట్ల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నాడట. అందులో కోటీ పది లక్షల రూపాయల పన్ను కట్టాల్సి ఉండగా, ఎక్స్‌పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద ఎన్టీఆర్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఎక్కువగా లండన్ లో జరగడంతో సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి 1.10 కోట్ల ట్యాక్స్ మినహాయింపు పొందినట్లు తెలిసింది.
ఇదే తరహాలో రణబీర్ కపూర్ కూడా ఆయే దిల్ హై ముష్కిల్ సినిమా విషయంలో ఈ తరహా మినహాయింపు పొందారు. దీంతో అతడికి కూడా నోటీసులు అందాయి. వీరిద్దరికీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడంపై కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కాగ్ భావించింది. దీంతో వారిద్దరికీ షోకాజ్ కం డిమాండ్ నోటీసులు ఇవ్వటంతో పాటు మిగిలిన అంశాలను కూడా పరిశీలించమని అధికారులను కోరింది.