Begin typing your search above and press return to search.

అన్నతో ఆ లెక్కలు లేవంటున్న తారక్

By:  Tupaki Desk   |   19 Sept 2017 3:29 PM IST
అన్నతో ఆ లెక్కలు లేవంటున్న తారక్
X
జూనియర్ ఎన్టీఆర్ పారితోషకం ఎంత..? అన్నయ్య కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుని ఉంటాడు..? ఎన్టీఆర్ తో సినిమా చేయడం వల్ల కళ్యాణ్ రామ్ ఎంత లాభం పొంది ఉంటాడు..? లాభాల్లో తారక్ కు ఎంత వాటా ఇస్తున్నాడు..? ఈ అంశాలపై కొన్నాళ్లుగా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఐతే ఎన్టీఆర్ దగ్గర ఈ లెక్కల గురించి ఎత్తితే మాత్రం లైట్ తీసుకోమంటున్నాడు. తమ దగ్గర ఆర్థిక పరమైన అంశాల చర్చే ఉండదని చెబుతున్నాడు. మామూలుగానే తాను తన నిర్మాతల దగ్గర ఫైనాన్షియల్ మేటర్స్ డిస్కస్ చేయనని.. అన్నయ్య దగ్గర అసలే ఆ ప్రస్తావన రాలేదని అతనన్నాడు. తనతో సినిమా చేసి కళ్యాణ్ రామ్ నష్టాల్ని పూడ్చుకుంటున్నాడన్న ప్రచారం మీదా ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘కల్యాణ్‌ అన్న కష్టాల్లో ఉన్నారని.. నాతో సినిమా చేసి ఆయనకు సుఖం వచ్చేసిందని నేను అనుకోవడం లేదు. ఆ చర్చ గురించి కామెంట్‌ చేయాల్సిన అవసరమే లేదనుకుంటున్నా. అన్నయ్య కష్టాల్లో ఉంటే ఇన్ని సినిమాలు ఎలా నిర్మిస్తాడు? ‘జై లవకుశ’ ఎలా తీస్తాడు? టెంపర్.. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్‌ సినిమాలు లేకపోయినా... నేను మూడు హిట్లు కొట్టకపోయినా అన్నయ్యతో సినిమాలు చేస్తాను. ఆయనేంటో నాకు తెలుసు. ఇక నాకు అన్నయ్యకు మధ్య ఆర్థిక పరమైన విషయాల ప్రస్తావనే ఉండదు. అసలు ఏ సినిమాకీ దర్శక నిర్మాతలతో నేను ఫైనాన్షియల్‌ మ్యాటర్స్‌ డిస్కస్‌ చేయను. వేరే నిర్మాతలతోనే చేయనప్పుడు అన్నయ్యతో మాత్రం ఎందుకు దాని గురించి చర్చిస్తా’’ అని ఎన్టీఆర్ ప్రశ్నించాడు.