Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఎందుకంత ఎమోషనల్ అవుతాడంటే..
By: Tupaki Desk | 23 Sep 2017 4:11 AM GMTఆడియో వేడుక అయినా.. ఇంకేదైనా అభిమానుల్ని కలుసుకునే ఫంక్షన్లో అయినా జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఎమోషనల్ అయిపోతాడో తెలిసిందే. అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నపుడు అతను తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తుంటాడు. ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడకుండా వేదిక దిగడు. తన ప్రసంగమే వాళ్లనుద్దేశించే మొదలుపెడతాడు. మొన్నటి ‘జై లవకుశ’ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగంతో అభిమానుల హృదయాల్ని టచ్ చేశాడు. మరి ఇలాంటి వేడుకల్లో మరీ అంత ఎమోషనల్ ఎందుకైపోతారు అని అడిగితే ఎన్టీఆర్ ఏం సమాధానం చెప్పాడంటే..
‘‘నా సినిమా ఆడియో వేడుక ఉందంటే.. ఆ రోజు ఇంటిదగ్గర ఉన్నంత వరకు బాగానే ఉంటాను. కానీ బయటికొచ్చి కారెక్కానంటే చాలు నాలో ఏదో తెలియని భావోద్వేగం మొదలైపోతుంది. ఒక రకమైన భయం కూడా మొదలవుతుంది. వాళ్లను కలుసుకోబోతున్నానంటే మనసంతా ఏదోలా అయిపోతుంది. ఇక వాళ్లను చూస్తే ఆగలేను. వాళ్లతో ఏదో కమ్యూనికేట్ చేయాలని ఉంటుంది. వాళ్ల మీద నా ప్రేమను చెప్పాలనుంటుంది. నా తల్లి నన్ను ప్రేమిస్తే.. మా నాన్న నన్ను ఇష్టపడితే.. మిగతా కుటుంబ సభ్యులు కూడా మనల్ని ప్రేమిస్తే దాన్ని అర్థం చేసుకోగలం. కానీ ఏ సంబంధం లేని అభిమానులు నన్నెందుకు ఇంతగా ప్రేమించాలి అనిపిస్తుంది. నేను ఇన్నేళ్లలో నా అభిమానుల్లో సగం మందిని కలిసి ఉంటానేమో. కానీ నన్ను కలవని వాళ్లు కూడా నన్ను అమితంగా అభిమానిస్తారు. నాపై ప్రేమ చూపిస్తారు. అందుకే వాళ్లందరికీ కృతజ్నతలు చెప్పాలనిపిస్తుంది. ఇది నన్ను భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ ప్రేమ నిజమైనది. మనం పోయినపుడు పాడె మోయడానికి నలుగురు బయటివాళ్లు కావాలంటారు. కానీ నాకు ఇంతమంది ఉన్నారని.. నాకేదైనా అయితే వాళ్లంతా చూసుకుంటారని చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇక్కడే నేనేదో సాధించాననిపిస్తుంది’’ అని ఎన్టీఆర్ చెప్పాడు.