Begin typing your search above and press return to search.

నా చుట్టూ అంతా హ్యాపీగా ఉండాలి! -ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   7 Oct 2018 4:32 AM GMT
నా చుట్టూ అంతా హ్యాపీగా ఉండాలి! -ఎన్టీఆర్‌
X
యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం- అర‌వింద స‌మేత. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మించారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న సినిమా రిలీజ‌వుతోంది. ఈ సందర్భం గా మీడియాతో ముచ్చ‌టించిన ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని తెలిపారు.

అర‌వింద స‌మేత మీలో తెచ్చిన మార్పు?

ఈ సినిమా క‌థ విన్న‌ప్పుడే నాలో చాలా మార్పు వ‌చ్చింది. ఇందులోని పాత్ర‌లు - వాటి ప్ర‌వ‌ర్త‌న‌లు నాలో చాలా మార్పులే తెచ్చాయి. అది చాలా మంచి మార్పు. నా చుట్టూ ఉన్న మ‌నుషుల్ని సంతోషంగా ఉంచే మార్పు ఇది. సంతోష‌మే స‌గం బ‌లం అని న‌మ్మే పాత్ర నాది.

పెనిమిటి సాంగ్‌ బాగా వైర‌ల్ అయ్యింది.. ఆ గీతంతో మీ అటాచ్‌ మెంట్‌?

అవును బాగా క‌నెక్ట‌య్యాం. అమ్మా నేను. నాన్న‌గారు చ‌నిపోయాక ఆ పాట‌ను తెర‌కెక్కించారు. ఆ పాట విన్న త‌ర్వాత అమ్మ కంట నీరు ఆగ‌లేదు. త‌ను ఏడ్చేసింది. నాన్న గారు చ‌నిపోయాక అమ్మ‌ - నేను మెంట‌ల్‌ గా ఇంకా స్ట్రాంగ్ అయ్యాం. ఆ స‌న్నివేశం అలాంటిది.. అందుకే ఆ పాట‌కు క‌నెక్ట‌య్యాం. అమ్మ‌కు, నాకే కాదు.. ఈ పాట అంద‌రికీ క‌నెక్ట‌వుతుంది.

జ‌క్క‌న్న‌తో మ‌ల్టీస్టార‌ర్‌ ఎప్పుడు?

నాకు దానిపై ఐడియా లేదు. త్వ‌ర‌లోనే సెట్స్‌ కెళుతుంద‌ని అనుకుంటున్నాను. దానిపైనే ఆలోచ‌న సాగుతోంది. అదో బ‌హుభాషా చిత్రం అవుతుంది. పాన్ ఇండియా సినిమాగా పెద్ద కాన్వాసు ఉన్న చిత్ర‌మ‌వుతుంది. దానిపై ఎంతో ఎగ్జ‌యిటింగ్‌ గానూ ఉన్నాను.

వెబ్ సిరీస్‌ లో ఆఫ‌ర్ వ‌స్తే?

అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాను. అయితే న‌న్ను ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ అడ‌గ‌లేదు. ఛాన్స్ వ‌స్తే ఎలా ఉంటుందో చూడాలి. వేచి చూస్తాను.

త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి?

ఇప్ప‌టికైతే నా మైండ్‌ లో వేరే ఏదీ లేదు. రాజ‌మౌళి గారితో సినిమా. అలానే వైజ‌యంతి మూవీస్ - అట్లీ కాంబినేష‌న్‌ లో న‌టించే సినిమా ఉంది. అయితే అది ఇంకా క‌న్ఫామ్ కాలేదు.