Begin typing your search above and press return to search.

నేను డైరక్షన్ చేస్తే.. డైరక్టర్ ఎందుకు?

By:  Tupaki Desk   |   19 Sep 2017 12:30 PM GMT
నేను డైరక్షన్ చేస్తే.. డైరక్టర్ ఎందుకు?
X
ఒక సినిమాను తెరకెక్కించాలంటే దర్శకుడు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తెరపై ఎంత మంది తారలు కనిపించినా తెర వెనుక నిర్మాత ఎంత డబ్బు పెట్టినా ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే అది తప్పకుండా ఒక దర్శకత్వ ప్రతిభ అనే చెప్పాలి. ఇక మిగతావారి పాత్ర ఎంత ఉన్నా ఒక్క దర్శకుడు అనుకున్నట్టుగా తీస్తేనే తెరపై సినిమా అద్భుతంగా వస్తుంది. అయితే కొంతమంది హీరోలు దర్శకులు సీన్స్ చేస్తుంటే ఇన్వాల్వ్ అవుతారని రూమర్ ఉంది.

సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో కొన్ని సీన్స్ ని దర్శకుడు బాబీ చేయకుండా పవన్ కళ్యాణ్ చేశాడని టాక్ ఉంది. అయితే మళ్లీ అదే తరహాలో "జై లవకుశ " సినిమాలో రిపీట్ అయ్యిందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా దర్శకుడి చైర్ లో కూర్చొని మరి యాక్షన్ కట్ చెప్పాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై తారక్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 'నేను కూడా చాలా రోజులుగా ఈ తరహా రూమర్స్ వింటున్నాను.. ఆ విషయంపై ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఒకవేళ నాకు దర్శకత్వ ప్రతిభ ఉంటె నేనేందుకు ఒక సినిమాను తెరకెక్కించలేను? నేను డైరెక్షన్ చేస్తే వేరేవారికి రెమ్యునరేషన్ అండ్ నేమ్ ఇవ్వడం ఎందుకు ? నేనే ఆ క్రెడిట్ తీసుకుంటాను కదా? ఒకవేళ నేను డైరక్షన్ చేసి ఉంటే ఎవరైనా సరే కేసు బుక్ చేసి జైల్లో వేయవచ్చు' అని తారక్ తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చాడు.

అంతే కాకుండా ఎప్పుడైనా సరే తాను స్టోరీ చెప్పినపుడు డౌట్ ఉంటే వాటిపై డిస్కస్ చేస్తానుగాని.. ఒకసారి కథ సెట్స్ పైకి వెళితే.. ఏ మాత్రం ఇన్వాల్వ్ కానని అంటున్నాడు. ఇక సినిమా విజయాన్ని అందుకుంటే అది పూర్తిగా దర్శకుడికే చెందుతుందని తారక్ వివరించాడు. మొత్తానికి ఎన్టీఆర్ ఈ సమాధానంతో రూమర్స్ కి కరెక్ట్ గా పులిస్టాప్ పెట్టాడనే చెప్పాలి.