Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డిజార్డర్ ను ప్రణతి భరిస్తోందట

By:  Tupaki Desk   |   7 Sep 2017 12:47 PM GMT
ఎన్టీఆర్ డిజార్డర్ ను ప్రణతి భరిస్తోందట
X
మొన్నామధ్యన వచ్చిన 'మహానుభావుడు' సినిమా ట్రైలర్ చూశారుగా. అందులో హీరోకు పరిశుభ్రత అంటే ప్రాణం ఇచ్చేయడం అలవాటు. కాని ఇతరులకు అది అతిగా కనిపిస్తుంది. అలా ఏదన్నా ఒక పనిపై కాస్త ఎక్కువగా శ్రద్ద మక్కువ ఉంటే దానిని 'అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్' అంటారు. అయితే ఇదే డిజార్డర్ హీరో ఎన్టీఆర్ కు కూడా ఉందట తెలుసా? సినిమాలో కాదండీ.. నిజజీవితంలోనే.. ప్చ్!!

మామూలుగా ఎవరన్నా చెబితే నమ్మమేమోకాని.. స్వయంగా ఆ విషయాన్ని బిగ్ బాస్ లో ఎన్టీఆరే రివీల్ చేశాడు. తనకు అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్ ఉండటంతో.. పొద్దున్నే లేవగానే సింక్ దగ్గరకు వెళితే.. అక్కడ తన కుడివైపున పళ్ళు తోముకునే బ్రష్.. ఎడం వైపును టూత్ పేస్ట్ ఉండాలట. అలా లేకపోతే కోపం వస్తుందట. అందుకే ఎన్టీఆర్ ను అర్ధంచేసుకుని.. తనకంటే ముందే తన భార్య నిద్రలేచి అలా సెట్ చేస్తుందట. అందుకే తన డిజార్డర్ ను భరిస్తున్నందుకు భార్యకు పెద్ద థ్యాంక్స్ అంటున్నాడు యంగ్ టైగర్.

బిగ్ బాస్ కార్యక్రమం సందర్భంగా అసలు ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్‌ గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడని ఎన్టీఆర్.. తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి.. అలాగే తను తండ్రైన తరువాత ఎలా మారిపోయాడో అనే విషయాల గురంచి చాలానే చెబుతున్నాడు. ప్రేక్షకులకు ఇటువంటి హార్ట్ టచింగ్ విషయాలు చెబుతూ మరింత దగ్గరవుతున్నాడు.