Begin typing your search above and press return to search.

మొదటి సారి ఆవిడ గురించి తారక్

By:  Tupaki Desk   |   7 Oct 2018 12:45 PM GMT
మొదటి సారి ఆవిడ గురించి తారక్
X
నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం తెలుగువారినందరిని కలచివేసింది. ఇక కుటుంబ సభ్యుల ఆవేదన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ తన తాజా సినిమా 'అరవింద సమేత' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాన్నగారిని టాపిక్ వచ్చినప్పుడు కంటతడి పెట్టుకున్నాడు. ప్రమోషన్స్ ఇంటర్వ్యూల్లో కూడా నాన్నగారిని చాలా సార్లు తలుచుకున్నాడు.

తండ్రి మరణం తో తాను.. కళ్యాణ్ అన్న ఎంతో బాధ పడుతున్నామని.. ఇంకా ఆ విషాదం నుండి తేరుకోలేక పోతున్నామని తెలిపాడు. అంతే కాదు.. తామిద్దరి కంటే తమ ఇద్దరు తల్లుల బాధ ఇంకా పెద్దదని చెప్పాడు. అమ్మ.. పెద్దమ్మ (కళ్యాణ్ రామ్ అమ్మగారు) ఇద్దరూ అందులో నుండి బయటకు రాలేకపోతున్నారని అన్నాడు. కళ్యాణ్ రామ్ అమ్మగారి గురించి తారక్ బయట మాట్లాడడం ఇదే మొదటిసారి. ఆమెను పెద్దమ్మ అని సంభోదించి తమ కుటుంబం ఒక్కటేనని చెప్పకనే చెప్పాడు.

ఎన్టీఆర్ అమ్మగారి గురించి మాట్లాడుతూ తన ఇద్దరూ కొడుకులతో గడిపితే ఆమెకు ఆ బాధ నుండి కాస్త ఊరట కలుగుతోందని చెప్పాడు. నాన్నగారు పరిపూర్ణ జీవితం గడిపారని.. తండ్రిగా అన్ని బాధ్యతలు నిర్వర్తించారని అన్నాడు. అయనలాగే పరిపూర్ణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నానని.. పిల్లలకు కూడా తనలాంటి జీవితమే ఇవ్వాలని అనుకుంటున్నానని తెలిపాడు.