Begin typing your search above and press return to search.

తారక్ చెప్పిన మల్టీ స్టారర్ ముచ్చట్లు!!

By:  Tupaki Desk   |   7 Oct 2018 6:49 AM GMT
తారక్ చెప్పిన మల్టీ స్టారర్ ముచ్చట్లు!!
X
మరో నాలుగు రోజుల్లో రానున్న అరవింద సమేత వీర రాఘవ ప్రమోషన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. విసుగు విరామం లేకుండా అందరికి ఇంటర్వ్యూలు వరసబెట్టి ఇచ్చేస్తున్నాడు. ఇవాళ్టి ప్రముఖ దినపత్రికలు అన్నింటిలోనూ యంగ్ టైగర్ దే హవా. అందులో భాగంగా అడిగిన ప్రశ్నల్లో మల్టీ స్టారర్ ప్రస్తావన కూడా వచ్చింది. దాని గురించి మాట్లాడుతూ చరణ్ లాంటి మంచి ఫ్రెండ్ తో కలిసి సినిమా చేయటం చాలా ఆనందంగా ఉందని ఓ కొత్త ట్రెండ్ కి ఇది శ్రీకారం చుడుతుందని నమ్మకం వ్యక్తం చేసాడు.

సోషల్ మీడియాలో కొందరు దీన్ని ఇద్దరు వేర్వేరు సామాజిక వర్గాల హీరోల కాంబోగా చూస్తున్నారని అదే తనకు వింతగా ఉందని అంటున్నాడు. అసలు కళలో సామజిక వర్గాలను చూడటం ఏంటని కొట్టిపారేసిన తారక్ అవకాశం సరైన దర్శకుడు దొరికితే తను చరణ్ తో పాటు మహేష్ కూడా కలిసి నటించేలా తమ మధ్య చర్చ నడుస్తుందని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. కానీ రాజమౌళి కాకుండా నెక్స్ట్ చేయబోతున్న మల్టీ స్టారర్ గురించి ఎవరు చెప్పినా భావ్యం కాదన్న తారక్ తమిళ దర్శకుడు అట్లీతో పాటు వైజయంతి బ్యానర్ కు ఓ సినిమా చేయాల్సిన విషయాన్నీ ఖరారు చేసాడు. కానీ అవన్నీ రాజమౌళి మూవీ అయ్యాకే అని క్లారిటీ ఇవ్వడంతో వచ్చే ఏడాది జూనియర్ సినిమా రావడం అనుమానమే.

వెబ్ సిరీస్ గురించి కూడా మాట్లాడిన తారక్ మంచి కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించేలా తీసేవాళ్ళు ముందు వస్తే అందులో భాగం కావడానికి సిద్ధమన్న జూనియర్ మొత్తానికి తన పరిధిని విస్తరించే పనిలో గట్టిగానే ఉన్నాడు. త్రివిక్రమ్ తో మొదటిసారి చేయటం పట్ల బాగా ఎగ్జైటింగ్ గా ఉన్న తారక్ అరవింద సమేత వీర రాఘవ మెప్పించడం ఖాయం అంటున్నాడు. మల్టీ స్టారర్ గురించి కొన్ని ముచ్చట్లు అయితే చెప్పాడు కానీ ఏ రోజు సెట్స్ అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.అవన్నీ రాజమౌళికే సంబంధం నటించడం వరకే నా పని అనేస్తున్నాడు.