Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ చేసి ఉంటేనా..
By: Tupaki Desk | 10 May 2018 8:32 AM GMTనిన్న రిలీజైన ‘మహానటి’ సినిమాకు అద్భుతమైన టాక్ వస్తోంది. ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఎన్నెన్ని విశేషాలున్నాయో. అలనాటి మహానటులు.. దిగ్గజ దర్శక నిర్మాతల పాత్రల్ని ఇప్పటి నటులు పోషించి మెప్పించారు. ముఖ్యంగా ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబును.. ఏఎన్నార్ గా అక్కినేని నాగచైతన్య కనిపించడం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. నాగేశ్వరరావును చైతూ అనుకరిస్తుంటే థియేటర్లలో ఈలలు.. చప్పట్లు పడుతున్నాయి.
చైతూకే ఇలా ఉంటే.. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించి ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఒక సీన్లో ఎన్టీఆర్ ప్రస్తావన రావడం ఆలస్యం థియేటర్ హోరెత్తిపోయింది. రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎవరతను అంటే.. రామారావు అని బదులిస్తుంది మరో పాత్ర. పూర్తి పేరు అడిగితే.. నందమూరి తారక రామారావు అంటాడు. అప్పుడు ‘ఈ పేరు గుర్తుంచుకోవాల్సిందే’ అంటాడు రాజేంద్రుడు. అప్పుడు గోల మామూలుగా ఉండదు. ఆ మాట అనగానే ఎన్టీఆర్ ను రెండు మూడు క్షణాలు డిజిటల్ రూపంలో చూపిస్తారు. అప్పుడు ఎన్టీఆర్ కర్రసాము సాధన చేస్తూ సెట్లోకి పాము వస్తే దాన్ని రక్షిస్తాడు.
ఆ సీన్ కనుక జూనియర్ ఎన్టీఆర్ చేసి ఉంటే మాత్రం ప్రేక్షకులు వెర్రెత్తి పోయి ఉండేవాళ్లే. ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుని ఉంటే అతడిని మరిన్ని సీన్లు పెట్టేవాళ్లు. చైతూ ఈ చిత్రం ఐదారు సీన్లలో కనిపిస్తాడు. అలా తారక్ కూడా అన్ని సీన్లు చేసి ఉంటే రెస్పాన్స్ ఎలా ఉండేదో.. సినిమాకు ఎంత ఆకర్షణ అయ్యుండేవాడో చెప్పేదేముంది? ఎన్టీఆర్ చేయననేసరికి ఇంకెవరినీ సంప్రదించకుండా ఎన్టీఆర్ పాత్రకు సీన్లే లేకుండా చేశారు. ఇందుకు చిత్ర బృందమూ చింతించి ఉంటుంది. ఇప్పుడీ చిత్రానికి వస్తున్న స్పందన చూసి ఎన్టీఆర్ కూడా తన నిర్ణయం పట్ల రిగ్రెట్ అవుతుంటాడేమో.