Begin typing your search above and press return to search.
ఫిట్ గా ఉండడం అనేది ఓ ప్రాసెస్: ఎన్టీఆర్
By: Tupaki Desk | 6 Oct 2018 4:38 PM GMT'అరవింద సమేత' మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెల్లగా ప్రమోషన్స్ లో జోరు పెంచుతూ ఒక్కో పోస్టర్.. వీడియో సాంగ్ ప్రోమోస్ రిలీజ్ చేస్తుంటే సినిమాపై హైప్ మరింతగా పెరుగుతోంది. ఇక ఎన్టీఆర్ కూడా తన వైపునుండి ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలు ఆడియన్స్ తో పంచుకుంటున్నాడు.
ఈ సినిమాకోసం ఎన్టీఆర్ రెండో సారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. 'టెంపర్' సినిమా లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో కనిపించిన తారక్ ఈసారి గురూజీ సినిమా కోసం మరో సారి ఫిట్ గా తయారయ్యి సిక్స్ ప్యాక్ తో అదరగొట్టాడు. మొదటి సారి సిక్స్ ప్యాక్ తో కనిపించినప్పుడు ఎన్టీఆర్ నిజంగా సిక్స్ ప్యాక్ చేయలేదని.. గ్రాఫిక్స్ లో కవర్ చేశారని కొన్ని విమర్శలు కూడా వినిపించాయి.
తాజా ఇంటర్వ్యూ లో సిక్స్ ప్యాక్ విశేషాల గురించి అడిగితే అదేమంత ప్రత్యేకం కాదని అందరూ కష్టపడ్డట్టే నేను కష్టపడ్డానని అన్నాడు. 'జై లవకుశ' టైమ్ లో లావయ్యనని కాకపొతే త్రివిక్రమ్ 'మీరు కొంచెం ఫిట్ గా ఉండాలి' అని అడిగారని.. దాంతో త్రివిక్రమ్ చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకున్నానని తెలిపాడు. లక్కీగా ఒక మంచి ట్రైనర్ దొరికాడని.. దాంతో బాడీ ని అదుపులోకి తెచ్చుకున్నానని అన్నాడు.
"సిక్స్ ప్యాక్ అన్నది సినిమా కోసమో.. ఫైట్ కోసమో కాదు. బాడీ ఫిట్ గా ఉండడం మన ఆరోగ్యానికీ మంచిది కదా? అదో ప్రాసెస్. నన్ను చూసి మా ఆవిడ కూడా ఇన్స్పిరేషన్ తెచ్చుకుంది. డెలివరీ సమయంలో తను చాలా లావయ్యింది. నువ్వు తగ్గావు కదా.. నేను కూడా తగ్గి చూపిస్తా అంటోంది" అని చెప్పాడు.