Begin typing your search above and press return to search.

సిక్స్ ప్యాక్ ప్లాన్ ముందు లేదు: ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   8 Oct 2018 5:30 PM GMT
సిక్స్ ప్యాక్ ప్లాన్ ముందు లేదు: ఎన్టీఆర్
X
సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించడం అనే ట్రెండ్ చాలా ఏళ్ళ క్రితమే బాలీవుడ్ లో స్టార్ట్ అయింది. టాలీవుడ్ కు కాస్త లేట్ గా వచ్చినా గట్టిగా తగులుకుంది. స్టార్ హీరోల నుండి మొదలుపెడితే కమెడియన్ టర్న్డ్ హీరోల వరకూ సిక్స్ ప్యాక్ తో ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా 'టెంపర్' సినిమాలో మొదటి సారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. ఇప్పుడు 'అరవింద సమేత' కోసం మరో సారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించడం విశేషం.

'అరవింద సమేత' ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ లు ఇద్దరూ సిక్స్ ప్యాక్ సీన్ గురించి మాట్లాడారు. త్రివిక్రమ్ మొదట మాట్లాడుతూ "సినిమా అనుకున్నప్పుడు మొదట్లో ఈ సిక్స్ ప్యాక్ ఆలోచన లేదు. కానీ ఎన్టీఆర్ తన పాత్ర పరంగా ఫిట్ గా ఉండాలి. దీంతో అయన మూడు నాలుగు నెలలు తన ఫిట్నెస్ పై వర్క్ చేశారు. అంతలో ఎన్టీఆర్ హార్డ్ వర్క్ ను చూపించేలా ఒక ఇంట్రెస్టింగ్ సీన్ రెడీ కావడంతో తను షర్టు తీయాల్సి వచ్చింది" అన్నారు.

మరోవైపు ఎన్టీఆర్ కూడా దాదాపుగా అదే చెప్పాడు. "సిక్స్ ప్యాక్ ను ఐటెం లా చేయాలనుకోలేదు. నాకైతే బాడీని షో ఆఫ్ చేయాలనే అలోచన ఖచ్చితంగా లేదు. కానీ రామ్ లక్షణ్ మాస్టర్లు ఒక మంచి సీన్ చెప్పడంతో అలా చేయాల్సి వచ్చింది." అంతే కాదు సిక్స్ ప్యాక్ చూపించే సీన్ హై ఎమోషన్ ఉండే సమయంలో ఫ్లో లో ఉంటుందని.. ఆ సీన్ సహజంగా ఉంటుంది గానీ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉండదని తెలిపాడు. అంతే కాదు త్రివిక్రమ్ ఆ సీన్ ను కళాత్మకంగా చూపించారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.