Begin typing your search above and press return to search.
నాకలాంటి ఛాన్స్ అరుదుగా వస్తుంది-ఎన్టీఆర్
By: Tupaki Desk | 26 Jan 2016 11:30 AM GMT‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో లుక్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ వైవిధ్యం చూపించాడు జూనియర్ ఎన్టీఆర్. అతడి నడక - డైలాగ్ డెలివరీ అన్నీ కూడా మారిపోయాయి. చివరికి డ్యాన్సుల్లో కూడా కొత్తదనం చూపించాడు. తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చుకుని డ్యాన్సులేశాడు ఎన్టీఆర్. గతంలో ఎన్టీఆర్ వేసిన రెగ్యులర్ స్టెప్పులేవీ కూడా ఇందులో కనిపించలేదు. మరి ఇంత వైవిధ్యం ఎలా అంటే.. అది సుకుమార్ ఘనతే అంటున్నాడు ఎన్టీఆర్. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో డ్యాన్సుల్లోనూ కొత్తదనం చూపించడానికి అవకాశం దొరికిందని.. మాస్ ప్రేక్షకుల కోసం ఒక డ్యాన్సులేస్తూ వచ్చిన తనకు ఇది అరుదైన అవకాశమని.. దీన్ని బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులేశానని ఎన్టీఆర్ చెప్పాడు.
‘‘లాహిరి లాహిరి లాహిరిలో అంటూ మాయా బజార్ సినిమాలో ఓ పాట ఉంటుంది. దానికి ఇష్టానుసారం డ్యాన్సులేస్తామంటే కుదురుతుందా? అలాగే ప్రతి సినిమాకూ ఒక థీమ్ ఉంటుంది. దాని ప్రకారమే డ్యాన్సులేయాలి. ఒక సినిమాలో ఉన్న ఆరు పాటలకూ డ్యాన్సులేసేయకూడదు. గతంలో నేను ఇలాంటి తప్పులు చేశా. అభిమానులు అలా ఆశిస్తారు కూడా. అలా ఆరు పాటలకూ డ్యాన్సులేసేస్తే దాన్ని దయ్యం ఆట అంటారు. ఏదీ కూడా శ్రుతి మించకూడదు. కానీ ‘నాన్నకు ప్రేమతో’ మాత్రం నాకు కొత్తగా ట్రై చేయడానికి అవకాశమిచ్చింది. ఇందులో డ్యాన్సులు వైవిధ్యంగా ఉన్నాయంటే.. అవన్నీ ఇంటెన్షనల్ గా చేసినవే. ముఖ్యంగా ‘లవ్ మి ఎగైన్’ పాట, అందులోని డ్యాన్స్ నాకు చాలా ప్రత్యేకం. నాలాంటి హీరో లవ్ మి ఎగైన్ అంటూ హీరోయిన్ వెంట పడుతూ పాట పాడే సందర్భంగా అరుదగా వస్తుంది. ఈ పాట కోసం రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి ఉదయం 7 వరకు షూటింగ్ చేసేవాళ్లం. పాట తెర మీద అద్భుతంగా వచ్చింది’’ అని ఎన్టీఆర్ చెప్పాడు.