Begin typing your search above and press return to search.

కొడితే ఎన్టీఆర్ లెవెలే మారిపోతుంది

By:  Tupaki Desk   |   31 Aug 2016 11:30 AM GMT
కొడితే ఎన్టీఆర్ లెవెలే మారిపోతుంది
X
కెరీర్ ఆరంభంలోనే ‘ఆది’ లాంటి బ్లాక్ బస్టర్.. ‘సింహాద్రి’ లాంటి ఇండస్ట్రీ హిట్ చూసిన హీరో జూనియర్ ఎన్టీఆర్. అతడి ఊపు చూస్తే.. చిరంజీవి తర్వాత ఆ స్థాయి ఉన్న హీరో అయ్యేలా కనిపించాడు. కానీ అంతెత్తుకు ఎగిరిన వాడు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో దబేల్ మని కింద పడ్డాడు. ఎన్టీఆర్ తర్వాత వచ్చిన హీరోలు వడివడిగా అతణ్ని దాటి ముందుకెళ్లిపోతుంటే.. అతనేమో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కే ప్రయత్నంలోనే అలసిపోయాడు. చిన్న హీరోగా ప్రస్థానం మొదలుపెట్టిన అల్లు అర్జున్.. వరుసగా మూడు సినిమాలతో రూ.50 కోట్ల క్లబ్బులో అడుగుపెడితే.. ఎన్టీఆర్ ఆ క్లబ్బును ఒక్కసారి టచ్ చేయడానికే కష్టపడిపోయే పరిస్థితి వచ్చింది.

అలాగని ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ ను.. అతడి ఫాలోయింగును తక్కువ అంచనా వేస్తే పొరబాటే. ఆ రెండు విషయాల్లోనూ అతడికి తిరుగులేదు. కానీ సరైన సినిమాలు పడక అతను వెనుకబడిపోయాడు. ఐతే టెంపర్.. నాన్నకు ప్రేమతో సినిమాలు అతడిని సరైన దారిలో నడిపించాయి. పోటీలో ఉన్న మిగతా హీరోలతో పోలిస్తే ఇంతకుమందు ఎన్టీఆర్ కు ఉన్న మైనస్ ఏంటంటే.. అతడికి క్లాస్ ఆడియన్స్ లో అంతగా ఫాలోయింగ్ లేకపోవడం. రెగ్యులర్ మాస్ క్యారెక్టర్లు చేయడం వల్ల వారిని అంతగా ఆకట్టుకోలేకపోయాడు ఎన్టీఆర్. ఐతే పై రెండు సినిమాలతో అతడి ఇమేజ్ మారింది. క్లాస్ లోకి కూడా చొచ్చుకెళ్లాడు. యూత్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ సినిమాల పరిధి పెరిగింది. ‘జనతా గ్యారేజ్’ సినిమా ఏవరేజ్ గా ఉన్నా చాలు.. రూ.50 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టడం ఖాయం. ఈ సినిమా అంచనాల్ని అందుకుందంటే మాత్రం రికార్డుల మోత మోగించేస్తుంది. కలెక్షన్ల పరంగా మిగతా హీరోలందరినీ దాటేసి పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుల లీగ్ లోకి చేరిపోతాడనడంలో సందేహం లేదు.