Begin typing your search above and press return to search.

ఆ ముప్పావు గంటలో ఏముంది?

By:  Tupaki Desk   |   12 Jan 2016 5:30 PM GMT
ఆ ముప్పావు గంటలో ఏముంది?
X
నాన్నకు ప్రేమతో ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ అగ్రెసివ్ గా పాల్గొంటున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా.. ఈ చిత్రానికి ప్రమోట్ చేస్తున్నాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ గతంలో కూడా పర్లేదు కానీ.. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతున్నాడు.

పోటీ ఎక్కువగా ఉండడం ఒక కారణమైతే.. అసలు నాన్నకు ప్రేమతో మూవీ కాన్సెప్టే ఎమోషనల్ కావడం మరో రీజన్ గా చెప్పచ్చు. ముఖ్యంగా ఓ 45 నిమిషాలు ఈ మూవీకి చాలా ముఖ్యం అంటున్నాడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఆడియో ఫంక్షన్ తోపాటు.. ఇంటర్వ్యూల్లో కూడా ప్రస్తావించాడు. అంటే.. నాన్నకు ప్రేమతో మూవీకి ఆ 45 నిమిషాలు ఆయువు పట్టు అనుకోవచ్చు. సాధారణంగా తెలుగు సినిమాల్లో ప్రీ క్లైమాక్స్, కలిపి దాదాపు ఇంత డ్యురేషన్ ఉంటాయి. మరి నాన్నకు ప్రేమతో చిత్రానికి కూడా అలాగే అనుకుందామా అంటే.. స్టోరీ ప్రకారం అలా కుదరదని చెప్పాలి.

ఈ మూవీ ఓ ఎమోషనల్ ప్లస్ మైండ్ గేమ్. అంటే దాదాపుగా ఇంటర్వెల్ సమయానికే హీరో, విలన్ల మధ్య గేమ్ రసవత్తరంగా మారిపోవాలి. అంటే ఈ లోపే తండ్రికి అనారోగ్యం, హీరో గేమ్ ప్లే వంటివి జరిగిపోవాలి. దాదాపు ఇక్కడితో ఎన్టీఆర్ చెప్పిన 45 నిమిషాలు అయిపోవచ్చని తెలుస్తోంది. అలాగే.. మొదట నాన్నకు ప్రేమతో 3 గంటల 50నిమిషాల నిడివి ఉందని అన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ వెర్షన్ 2గంటల 48నిమిషాలు మాత్రమే ఉందన్నది అఫీషియల్ న్యూస్. ఎన్టీఆర్ చెప్పిన ఆ ముప్పావుగంట.. ఎమోషనల్ కంటెంటేనా అనుకుంటున్నారు. మరి మన దగ్గర ఇంత సేపు సెంటిమెంట్ ని కంటిన్యూగా పండించేస్తే... ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్నది అసలు ప్రశ్న. చూద్దాం.. విషయం తెలీడానికి మరి కొన్ని గంటలేగా టైం ఉంది.