Begin typing your search above and press return to search.

మాస్ కంటెంట్ అంటే క్లాస్ పీకాడు

By:  Tupaki Desk   |   12 Jan 2016 10:30 PM GMT
మాస్ కంటెంట్ అంటే క్లాస్ పీకాడు
X
మీ సినిమాలో మాస్ కంటెంట్ లేదేంటి? క‌్లాస్‌ గా క‌నిపిస్తున్నారేంటి? ఇలాంటి ప్ర‌శ్న‌లు వేస్తే ఎన్టీఆర్‌ కి తిక్క రేగుద్ది. ఓల‌మ్మీ తిమ్మిరెక్కిందా? అంటూ ఆట‌ప‌ట్టించిన వాడు .. ఇటు స‌మాదానం లోనూ అంతే టీజ్ చేస్తున్నాడు. అస‌లు నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో మాస్ కంటెంట్ క‌నిపించ‌లేదేం? అని ప్ర‌శ్నించినందుకు ఓ రేంజులో డీటెయిలింగ్ ఇచ్చాడు మ‌రి.

అస‌లు తెలుగు ప్రేక్ష‌కులు అన్నివేళ‌లా రిచ్ కంటెంట్‌ ని ఇష్ట‌ప‌డ్డారు. వైవిధ్యానికి పెద్ద పీట వేసి సినిమాల్ని ఆద‌రించారు. తాత‌య్య ఎన్టీఆర్ న‌టించిన గుండ‌మ్మ క‌థ‌ - వేట‌గాడు చిత్రాల్ని ఎంత‌గానో ఆద‌రించారు. చిరంజీవి న‌టించిన రుద్ర‌వీణ ఫేమ‌స్ మూవీ. బాబాయ్ బాల‌కృష్ణ న‌టించిన ఆదిత్య 369 - నాగార్జున గీతాంజ‌లి - వెంక‌టేష్ ప్రేమ ఇవ‌న్నీ మేటి క్లాసిక్స్‌. వీట‌న్నిటికీ జ‌నాలు నీరాజ‌నాలు ప‌లికారు.

నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో అస‌లేం మాస్ కంటెంట్ లేదే? అని ఎలా అడుగుతున్నారు. ఈ సినిమాలో మీరాశించినది ఉందా? లేదా? అన్న‌ది థియేట‌ర్ల‌లోనే చూసి చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడితే అది చాలా ఎర్లీ అనిపించుకుంటుంది అని ఫ‌జిల్ ఆడియెన్‌ కే వేశాడు తెలివైన ఎన్టీఆర్‌.