Begin typing your search above and press return to search.
రూటు మార్చి ఫేట్ మార్చుకున్న ఎన్టీఆర్
By: Tupaki Desk | 17 Jan 2016 1:30 PM GMTనాన్నకు ప్రేమతో చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫేటు మార్చేసింది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్, కలెక్షన్స్ రాబట్టడమే కాదు.. తొలి వారాంతానికే తన గత సినిమాల టోటల్ కలెక్షన్లు అన్నిటినీ దాటేసే రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకూ ఎన్టీఆర్ సినిమాల్లో 43 కోట్లతో టెంపర్ హైయెస్ట్ ప్లేస్ లో ఉంది. మూడు రోజులకే 30 దాటేసిన ఎన్టీఆర్ ఇప్పుడా రికార్డును అవలీలగా బ్రేక్ చేసేయడం ఖాయం.
ఇంతగా ఎన్టీఆర్ చెలరేగిపోవడానికి కారణం.. తన రూట్ ని కంప్లీట్ గా ఛేంజ్ చేసుకోవడమే అని చెప్పాల్సిందే. గతంలో కేవలం మాస్ సినిమాలపై జూనియర్ ఆధారపడేవాడు. ఆది, సింహాద్రి తరువాత వరుసగా అవే టైపు మూవీస్ చేసి బోరు కొట్టించేశాడు. కానీ బృందావనం సక్సెస్ తర్వాత బుడ్డోడి ఆలోచనలు కూడా మారాయి. ఊసరవెల్లి - టెంపర్ ఇలాంటి డిఫరెంట్ ఎటెంప్ట్స్ గానే చెప్పాలి. కానీ అవేవీ ఎన్టీఆర్ కి భారీ హిట్స్ ను అందించలేకపోయాయి.
సుకుమార్ డైరెక్షన్ లో చేసిన నాన్నకు ప్రేమతో మాస్ ఆడియన్స్ కంటే క్లాస్ ఆడియన్స్ కే ఎక్కువ నచ్చింది. ఈ సినిమా అర్ధం కావాలంటే.. మినిమం డిగ్రీ చదివి ఉండాలనే లాంటి కామెంట్స్ వినపడ్డా.. వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. మాస్ జనాల కోసం ప్రత్యేకంగా పంచ్ డైలాగ్స్ ఏవీ లేకపోయినా.. కలెక్షన్స్ మాత్రం కేకలు పెట్టిస్తున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ ని మాస్ తో పాటు, క్లాస్ ఆడియన్స్ కి పూర్తిగా చేరువ చేసిన చిత్రంగా నాన్నకు ప్రేమతో నిలిచిపోయింది.