Begin typing your search above and press return to search.

జూ.ఎన్టీఆర్‌ ఏం చెప్పబోతున్నాడు??

By:  Tupaki Desk   |   9 Nov 2015 3:30 PM GMT
జూ.ఎన్టీఆర్‌ ఏం చెప్పబోతున్నాడు??
X
సంక్రాంతికి ఎటాక్‌ మామూలుగా లేదు. ఒక ప్రక్కన జనవరి 8న నేను 'నాన్నకు ప్రేమతో' సినిమాతో వస్తున్నానోచ్‌ అంటూ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎప్పుడో ప్రకటించినా కూడా.. చివరకు ఆ సీజన్‌ అంతా ఫుల్‌ బిజీగా మారిపోయింది. సోలో రిలీజ్‌ కు ఎవ్వరూ ఛాన్సివ్వట్లేదు.

బాబాయ్‌ బాలయ్య 'డిక్టేటర్‌' సినిమాను 14న విడుదల చేస్తానంటూ ప్రకటించేశారు. దానితో ఎన్టీఆర్ వెనక్కి వెళతానని సన్నిహితులతో షేర్‌ చేసుకున్నాడు. కాని ఇంత హై పొటన్షియల్‌ సీజన్‌ ను మిస్‌ చేసుకుంటే.. తమ ఇన్వెస్టుమెంట్‌ రికవర్‌ చేసుకోవడం కష్టమంటూ పంపిణీదారులు ఒక డైలాగ్‌ కొట్టారట. కట్‌ చేస్తే.. జనవరి 8 లేక 14 రావడానికి మరో నాలుగు సినిమాలు రెడీ అయ్యాయ్‌. నాగార్జున - సునీల్‌ - నాని - శర్వానంద్‌ లు తమ తదుపరి ప్రాజెక్టులతో ఎటాక్‌ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు కూడా పొంగల్‌ పై కన్నేసే ఛాన్సుందిలే.

ఇదిలా ఉండగా.. నవంబర్‌ 10 సాయత్రం 4 గంటల 30 నిమిషాలకు నాన్నకు ప్రేమతో కొత్త పోస్టర్‌ కోసం రెడీ ఉండండీ అని ప్రకటించారు సినిమా నిర్మాతలు. కొత్త పోస్టర్‌ అంటే విత్‌ డేట్‌ ఉంటుందా? రిలీజ్‌ ఎప్పుడో చెబుతారా? జనవరిలోనే వస్తున్నాడా జూనియర్ లేకపోతే షిఫ్టు అవుతాడా? అసలు మనోడు ఏం చెప్పబోతున్నాడు. వస్తున్నాను అంటే.. బాబాయ్‌ కి పోటీ వస్తావా అంటూ కొందరు ఫ్యాన్సు దాడి చేసే ఛాన్సుంది. రావట్లేదు అంటే.. ఇతర హీరోలందరూ సంక్రాంతిని ఇంకాస్త గట్టిగా ఎటాక్‌ చేసే సీనుంది.