Begin typing your search above and press return to search.
NTR 31- NTR 32 డైరెక్టర్స్ ఫిక్సయ్యారా?
By: Tupaki Desk | 28 Jun 2020 5:30 AM GMTత్రివిక్రమ్ దర్శకత్వంలో NTR 30 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే అందుకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బృందం సన్నాహకాల్లో ఉంది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ తో కలిసి హారిక సంస్థ నిర్మిస్తోంది. మహమ్మారీ శాంతిస్తే ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ముగించి.. ఎన్టీఆర్ సెట్స్ లో జాయిన్ అవుతారు.
ఈ సినిమా తర్వాత నెక్ట్స్ ఏంటి? అంటే ఎన్టీఆర్ 31 .. ఎన్టీఆర్ 32 చిత్రాలకు ఇప్పటి నుంచే ప్లాన్ సిద్ధంగానే ఉందని తెలిసింది. తారక్ కోసం ఇప్పటికే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. పలు దఫాలుగా తారక్ తో కథా చర్చలు సాగించారు సదరు దర్శకుడు. పాన్ ఇండియా కేటగిరీలో తెలుగు-తమిళం- హిందీ మార్కెట్లను దృష్టి లో పెట్టుకుని తెరకెక్కించే చిత్రమిది. కేజీఎఫ్ 2 చిత్రీకరణను త్వరగా ముగించి పూర్తిగా తారక్ తో మూవీ పనిలోనే ఉంటాడట ప్రశాంత్ నీల్.
ఆ తర్వాత ఎన్టీఆర్ 32 కోసం అట్లీ రెడీ అవుతున్నాడని తెలిసింది. అట్లీ-అశ్వనిదత్ బృందం చాలా కాలంగా ఎన్టీఆర్ కోసం మంచి కథను లాక్ చేసి పూర్తి స్థాయి స్క్రిప్టును రెడీ చేసే పనిలో ఉన్నారు. తారక్ కాల్షీట్లను అశ్వనిదత్ లాక్ చేసారు. అయితే మహమ్మారీ అన్ని ప్రణాళికల్ని డిస్ట్రబ్ చేసింది. 2021లో ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ .. ప్రశాంత్ నీల్ చిత్రాలతో 2021 పూర్తవుతుంది. అదే ఏడాది ఎండింగులో లేదా 2022లో అట్లీతో తారక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడే ఛాన్సుందట.