Begin typing your search above and press return to search.

ప్చ్.. పెనివిటికి అన్యాయం జరిగింది!

By:  Tupaki Desk   |   12 Oct 2018 7:41 AM GMT
ప్చ్.. పెనివిటికి అన్యాయం జరిగింది!
X
రిలీజ్ కాకముందు విన్న పాటలన్నీ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ హిట్ కావాలనే రూల్ ఏమీ లేదు. ఒక్కోసారి సాదాసీదాగా అనిపించే పాటలే మంచి చిత్రీకరణ తోడైతే ఎక్కడికో వెళ్ళిపోతాయి. సూపర్ హిట్ అవుతాయి. అలాగే కొన్నిపాటలు మొదటిసారి విన్నప్పుడే నచ్చేస్తాయి. కానీ చిత్రీకరణ చూసిన తర్వాత ఇక ఆ పాటను మళ్ళీ వినాలని కూడా అనిపించదు. 'పెనివిటి' మరీ అంత ఘోరం కాదు గానీ పరిస్థితి మాత్రం దాదాపుగా అలాగే ఉంది.

పెనివిటి పాటకు సాహిత్యం అద్భుతం.. ట్యూన్ సూపర్. చాలా డీప్ మీనింగ్ తో హృదయాన్ని తాకే పాట కావడంతో సినిమాలో ఈ పాట చిత్రీకరణ ఓ రేంజ్ లో ఉంటుందని అనుకున్నారు. కానీ పెనివిటి సాంగ్ ప్రోమో రిలీజ్ అయినప్పుడే చాలామంది జనాలకు తేడా కొట్టింది. అలాటి పాటను ఇలా చేయడం ఏంటని విమర్శించారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట పెద్దగా అకట్టుకోలేదు. ఎన్టీఆర్ స్టెప్పులు.. గిటార్.. వెస్టర్న్ బ్యాక్ డ్రాప్ ఏమాత్రం ఆ పాట ఎమోషన్ కు సెట్ కాలేదు. అసలు పాట సాహిత్యానికి.. చిత్రీకరణకు పొంతనే లేదు. మధ్యలో మోంటేజ్ షాట్స్ ఉన్నప్పటికీ ఈ వెస్టర్న్ హంగామా పంటికింద రాయిలా అనిపించింది.

వీటన్నిటికీ తోడు.. పాట వచ్చిన సందర్భం కూడా బలవంతంగా ఇరికించినట్టుగా ఉంది. ఫ్లోలో లేదు. ఎదేమైనా పెనివిటికి అన్యాయం జరిగిందనేది మాత్రం వాస్తవం. మంచి చిత్రీకరణ కనుక తోడై ఉంటె ఈ పాట ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయి ఉండేదని చాలామంది నెటిజనులు ఓపెన్ గానీ కామెంట్ చేస్తున్నారు.