Begin typing your search above and press return to search.

కిరాక్ ప్లానింగ్ లో యంగ్ టైగర్!

By:  Tupaki Desk   |   17 May 2020 5:30 PM GMT
కిరాక్ ప్లానింగ్ లో యంగ్ టైగర్!
X
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎన్టీఆర్ కు ఉన్న లైనప్ మరెవరికీ లేదు. అన్నీ క్రేజీ ప్రాజెక్టులే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి చేస్తున్న 'RRR' భారీ పాన్ ఇండియా ఫిలిం. ఈ సినిమా తర్వాత 'అల వైకుంఠపురములో' సినిమాతో సూపర్ ఫాం లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్. దీని తర్వాత 'కెజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

'RRR' కు ముందు నుంచి ఎన్టీఆర్ ఎంతో ఆచితూచి తన సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే దిశగా తన ప్లానింగ్ సాగుతోందని అంటున్నారు. త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమాలో సంజయ్ దత్ ను నటింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఇప్పటికే టాక్ ఉంది. దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా మలచాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. ఎన్టీఆర్ తో ఉన్న పరిచయంతో సంజయ్ దత్ ఈ సినిమాకు తప్పకుండా ఒప్పుకుంటాడని అంటున్నారు. 'కె.జి.ఎఫ్- 2' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నప్పుడు సంజయ్ దత్.. యష్ ఇద్దరినీ ఎన్టీఆర్ తన ఇంటికి ఆహ్వానించారట. అప్పట్లో వారికి తన నివాసంలో స్పెషల్ పార్టీ ఇచ్చారట. దీంతో ముగ్గురికి మంచి స్నేహం కుదిరిందని అంటున్నారు. ఆ చనువుతోనే సంజయ్ దత్ ను తన సినిమాలో నటింపజేయాలని భావిస్తున్నారట.

త్రివిక్రమ్ ప్రాజెక్టు తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తారట. 'RRR' తో దేశవ్యాప్తంగా స్టార్ గా ఎదుగుతారు కాబట్టి తర్వాత రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తే ప్రభాస్ తరహాలో పాన్ ఇండియా స్టార్ గా అవతరించవచ్చని ప్లాన్ చేస్తున్నారట.