Begin typing your search above and press return to search.

#RRR: తారక్ విశ్వరూపమేనట!

By:  Tupaki Desk   |   29 July 2018 9:42 AM GMT
#RRR: తారక్ విశ్వరూపమేనట!
X
ఎన్నో సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.. కొన్ని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.. మరెన్నో ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాయి కానీ #RRR లాంటి ప్రాజెక్ట్ మాత్రం ఒక్కటే. రాజమౌళి నెక్స్ట్ సినిమా కావడంతో దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందులోనూ తెలుగువారికి ఇది మరింత ప్రత్యేకమైనది.. ఇద్దరు టాప్ స్టార్లైన ఎన్టీఆర్ - చరణ్ లతో మెగా - నందమూరి మల్టిస్టారర్ కావడమే దానికి కారణం.

ఈ సినిమా కథ బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో ఉంటుందని భారత స్వాతంత్ర్య పోరాటం కూడా ఇందులో ఉంటుందని కూడా ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోషించే పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక రెబెల్ లీడర్ పాత్రలో కనిపిస్తాడట. అంటే.. అల్లూరి సీతారామరాజు లాంటి విప్లవవీరుడి ఛాయలున్న పాత్ర. ఎన్టీఆర్ నటనలో ఎమోషనల్ సీన్స్ చాలా స్పెషల్.. సరైన సీన్ పడితే ఆడియన్స్ ను అలా కట్టిపడేస్తాడు. అలాంటిది ఫుల్ టెంపర్ తో ఉన్న రెబెల్ క్యారెక్టర్ అయితే ఇక దుమ్ము రేపడం ఖాయం.

మరి తారక్ కోసం ఇంత పవర్ఫుల్ రోల్ రెడీ చేస్తే చరణ్ కు ఎలాంటి రోల్ డిజైన్ చేసిపెట్టాడో మన జక్కన్న. అది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. ఇక ప్రీ-ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాను నవంబర్లో సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయట. రాజమౌళి ఆయన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ ను పకడ్బందీగా రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడట.