Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఎంతమందికి దక్కుతుంది ఇలాంటి అవకాశం

By:  Tupaki Desk   |   13 March 2023 7:09 PM GMT
పిక్ టాక్ : ఎంతమందికి దక్కుతుంది ఇలాంటి అవకాశం
X
తెలుగు సినిమా ప్రముఖులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ అవార్డు వేడుక పూర్తయ్యింది. ఆశించినట్లే.. ఊహించినట్లే మన జక్కన్న రాజమౌళి ఆవిష్కరించిన నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కింది. అద్భుతం ఆవిష్కారం అయ్యిందని ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏడాది వేలాది సినిమాలు వస్తున్నాయి. హిందీతో పాటు పలు నార్త్‌ ఇండియన్ భాష ల నుండి మరియు సౌత్‌ ఇండియన్ భాషల నుండి భారీ ఎత్తున సినిమాలు వస్తూనే ఉంటాయి. అలాంటిది ఆస్కార్‌ అనేది ఒక పెద్ద బ్రహ్మపదార్థం లాంటిది అయ్యింది. వేలాది సినిమాలు రూపొందుతున్న సమయంలో ఒక్క ఆస్కార్‌ ఎందుకు రావడం లేదని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేయడం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది.

ఆస్కార్‌ అవార్డ్‌ ను అందుకోవడం కాదు.. ఆ వేడుకలో పాల్గొనడమే గొప్ప అన్నట్లుగా సినీ ప్రముఖులు భావిస్తున్న సమయంలో మన టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్‌ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్‌ అవార్డును చిత్ర యూనిట్‌ సభ్యులు పట్టుకుని ఫోజ్‌ ఇచ్చిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్‌ చేతిలో గోల్డెన్‌ ఆస్కార్‌ ట్రోఫీ ఉన్న ఫొటో తెగ వైరల్‌ అవుతోంది. నాటు నాటు పాటలో ఎన్టీఆర్‌ పడ్డ కష్టం క్లీయర్‌ గా కనిపిస్తూ ఉంటుంది. చరణ్ తో కలిసి ఎన్టీఆర్‌ వేసిన స్టెప్స్‌ కూడా నాటు నాటును ఈ స్థాయిలో నిలిపింది అనడంలో సందేహం లేదు. అందుకే ఎన్టీఆర్‌ చేతిలో ఆస్కార్ ను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆస్కార్ ను గర్వంగా చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజ్ ఇచ్చే గౌరవం ఎంత మందికి దక్కుతుంది కదా..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.