Begin typing your search above and press return to search.
రాసి పెట్టుకోండి.. అఖిల్ ఫైనెస్ట్ యాక్టర్!
By: Tupaki Desk | 19 Jan 2019 5:11 PM GMTఅక్కినేని నటవారసుడు అఖిల్ నటించిన తొలి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అఖిల్ - హలో చిత్రాలు `తానొకటి తలిస్తే` అన్న చందంగా ఫెయిలయ్యాయి. అఖిల్ బాగా నటించాడని ప్రశంసలు దక్కినా, సినిమాల ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ క్రమంలోనే మూడవ సినిమా కోసం అఖిల్ చాలా కాలమే వేచి చూశాడు. `తొలి ప్రేమ` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ కుడుములతో సినిమాకి కమిటయ్యాడు. అలా `మిస్టర్ మజ్ను` తెరకెక్కి ఈనెల 25న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
నేటి సాయంత్రం హైదరాబాద్ జేఈఆర్ సీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ `మిస్టర్ మజ్ను` ట్రైలర్ ని ఆవిష్కరించారు. ట్రైలర్ వీక్షించిన అనంతరం ఎన్టీఆర్ తనదైన స్టైల్లో ఎమోషనల్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. నాగార్జునను బాబాయ్ అని, అఖిల్ ని తమ్ముడు అని సంబోధిస్తూనే .. అఖిల్ లోని ఓ గొప్ప లక్షణం గురించి తారక్ లీక్ చేశాడు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ-``అఖిల్ లో చూసిన ఒక గొప్ప గుణం .. చాలా తక్కువమందిలో నేను చూసినది- ఆత్మ విమర్శ. ఒక నటుడికి కావాల్సింది ఆత్మ విమర్శ. అఖిల్ కంటే గొప్పగా ఎవరూ ఆత్మ విమర్శ చేసుకోలేరు. అందుకు గట్స్ ఉండాలి. తనని తాను మార్చుకుంటూ ఆత్మ విమర్శ చేసుకుంటూ ఈ జర్నీ సాగిస్తున్నాడు. ఇక తాను ఆశించిన ఆ బ్లాక్ బస్టర్ ఎంతో దూరంలో లేదు. `మిస్టర్ మజ్ను`తో సక్సెస్ వస్తుందని అర్థమవుతోంది. అఖిల్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుంది`` అని అన్నారు. అఖిల్ టాలీవుడ్ లోనే ఒకానొక ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అవుతాడు.. ఇక్కడ నేను స్టార్ డమ్ గురించి మాట్లాడడం లేదని తారక్ ఎమోషన్ అయ్యాడు. మొత్తానికి అఖిల్ ని ఆరంభ గాయాలు ఇబ్బంది పెట్టినప్పుడు తనని తాను ఆత్మ విమర్శ చేసుకుని కరెక్షన్ కి వచ్చిన సంగతిని తారక్ రివీల్ చేశారన్నమాట. తారక్ అంత నమ్మకంగా చెబుతున్నాడంటే.. అఖిల్ హిట్టు కొడతాడేమో!