Begin typing your search above and press return to search.

భరత్ అనే నేను.. తారక్ ఏమన్నాడంటే..

By:  Tupaki Desk   |   23 April 2018 11:31 AM IST
భరత్ అనే నేను.. తారక్  ఏమన్నాడంటే..
X
టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డుల నుంచి ప్రయోగాత్మక చిత్రాల వరకు అన్నిట్లో మార్పులు వస్తున్నాయి. అంతే కాకుండా మన స్టార్స్ లో కూడా కొత్త అలవాట్లు మొదలయ్యాయి. సినిమా హీరోలు వారు వ్యక్తిగతంగా దగ్గరగ్గా ఉన్నా కూడా బాహ్య ప్రపంచంలో కలిసి కనిపించరు. ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడుకుంటే అది హాట్ టాపిక్ అయ్యేది. ఇక ఇప్పటి నుంచి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు అలాంటి విషయాలు రోజుకొకటి వస్తాయని చెప్పవచ్చు.

భరత్ అనే నేను సినిమా ద్వారా మహేష్ బాబు ఆ విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తారక్ వచ్చి ఎలా సందడి చేశాడో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ కూడా మహేష్ అన్నా అని సంభోదించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు స్పెషల్ గా సినిమాను వీక్షించి తారక్ చిత్ర యూనిట్ ని అభినందించారు. ముఖ్యంగా హీరో మహేష్ చాలా అద్భుతంగా నటించారు అని ఆయన లాగా డిఫరెంట్ క్యారెక్టర్లు ఎవరు చేయలేరని చెప్పారు.

ఒక సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ సినిమా తెరకెక్కించడమంటే ఈజీ కాదు. చాలా బాద్యతతో కూడుకున్నది. దర్శకుడు కొరటాల తన ప్రతిభను మరోసారి చూపించారు. భరత్ అనే నేను సినిమాలో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని నిజాయితీగా తీసిన ఈ సినిమా చరిత్రలోనే ఒక మంచి సినిమాగా నిలిచిపోతుందని తారక్ సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలియజేశారు. ఇంతకుముందు ఎన్టీఆర్ రంగస్థలం సినిమా కూడా చాలా బావుందని చిత్రయూనిట్ ని ప్రశంసించిన సంగతి అందరికీ తెలిసిందే.