Begin typing your search above and press return to search.
ప్రాఫిట్స్ మాత్రమే తీసుకుంటున్న తారక్
By: Tupaki Desk | 17 Aug 2016 1:05 PM GMTఇప్పటివరకు కేవలం రెమ్యూనరేషన్ తీసుకునే సినిమాలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇక మీదట ప్రాఫిట్ షేరింగ్ పద్దతిలో సినిమాలు చేయనున్నాడా ? అంటే అవుననే వినిపిస్తోంది. ఒకప్పుడు చిరంజీవి ఏరియా రైట్స్ తన రెమ్యూనరేషన్ గా తీసుకుంటే.. ఆ తరువాత మహేష్ బాబు సినిమాలో తనూ ఓ భాగమై సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతొచ్చిందనమాట. అయితే ఈ ఆఫర్ తారక్ అందరికీ ఇవ్వలేదు.
అవును.. అన్నయ్య కళ్యాణ్ రామ్ తో చేసే సినిమాకు మాత్రమే ఎన్టీఆర్ ఈ పద్దతిలో చేయనున్నాడట. నిజానికి కళ్యాణ్ రామ్ దగ్గర కేవలం 1116 రూపాయలను అడ్వాన్సుగా తీసుకుని.. తక్కిన రెమ్యూనరేషన్ సినిమా పూర్తయ్యాక దానిని పంపిణీదారులకు అమ్మేస్తే వచ్చే లాభాల్లో పంచుకుంటాడు తారక్. ఈ సినిమాను రూపొందించబోయేది రైటర్ వక్కంతం వంశీ అనే విషయం ఇప్పటికే మనకు తెలిసిందే. ఈ సినిమాతో అతను దర్శకుడిగా మారనున్నాడు. దాదాపు 40 కోట్లతో ఈ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాను ఫ్రాఫిట్స్ షేరింగ్ పద్దతిలో చేస్తున్న ఎన్టీఆర్.. ఇతర ప్రొడక్షన్ హౌసులు తీసే సినిమాలను కూడా అదే పద్దతిలో చేస్తే.. ఖచ్చితంగా నిర్మాతలపై ప్రొడక్షన్ భారం తగ్గిపోయి.. హ్యాపీగా బోలెడన్ని పెద్ద పెద్ద సినిమాలు ఫాస్టుగా వచ్చేస్తాయి. కేవలం రెమ్యూనరేషన్లకే ప్రతీ పెద్ద సినిమా దాదాపు 30 కోట్లు ఖర్చుపెడుతోందంటే చూస్కోండి మరి.