Begin typing your search above and press return to search.
'ఆర్ ఆర్ ఆర్' ఇంటర్వెల్ ముందు సీన్ ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 14 Jan 2020 6:34 AM GMTగత రెండు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల భారీ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లే అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. రాజమౌళి గతంలో ప్రకటించిన జులై 30వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటేనే భారీతనంకు పెట్టింది పేరు అన్నట్లుగా ఉంటుంది. ఇక జక్కన్న ప్రతి సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు సీన్స్ ఒల్లు గగుర్లు పొడిచే విధంగా ఉంటుంది.
జక్కన్న గత చిత్రాల మాదిరిగా ఈ చిత్రంలో కూడా అద్బుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీం పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. వారిద్దరు కలిసి అంటే అల్లూరి మరియు కొమురం భీంలు కలిసి బ్రిటీష్ వారి పైకి యుద్దంకు వెళ్తారట. బ్రిటీష్ వారిని మట్టికరిపించడంతో ఇంటర్వెల్ పడుతుందట.
ఇంటర్వెల్ కు ముందు ఉండే ఈ 20 నిమిషాల భీకర యుద్ద సన్నివేశాల్లో అల్లూరి పాత్రలో చరణ్ మరియు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ ను చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉంటారట. ఆ సీన్స్ లో వీరిద్దరి నటన మరియు రౌద్రం సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆ యుద్ద సన్నివేశం తర్వాత ఇంటర్వెల్ పడుతుందట. ఈ చిత్రం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూ సినిమా అంచనాలు పెంచుతూనే ఉంది. ఇప్పుడు ఇంటర్వెల్ యుద్ద సన్నివేశం అంటూ వస్తున్న ఈ వార్తలు సినిమాపై అంచనాలను పీక్స్ కు తీసుకు వెళ్తుంది.