Begin typing your search above and press return to search.

మార్వెల్‌ క్యారెక్టర్స్ ల్లో ఎన్టీఆర్‌.. చరణ్‌ డ్రీమ్ రోల్స్‌

By:  Tupaki Desk   |   11 Jan 2023 5:50 AM GMT
మార్వెల్‌ క్యారెక్టర్స్ ల్లో ఎన్టీఆర్‌.. చరణ్‌ డ్రీమ్ రోల్స్‌
X
ఇండియన్‌ సినీ చరిత్రలో నిలిచి పోయే రోజు నేడు. ఇండియన్స్‌ లేస్తూ ఉండటంతోనే ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు అంతర్జాతీయ స్థాయి గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు దక్కినట్లుగా వార్తలు వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో హాజరు అయిన సమయంలో.. కీరవాణి అవార్డును సొంతం చేసుకున్న తర్వాత ఆర్ఆర్‌ఆర్ స్టార్స్ మాట్లాడిన మాటలు వైరల్‌ అవుతున్నాయి.

రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు అవార్డు కార్యక్రమంలో భాగంగా రెడ్‌ కార్పెట్‌ పై మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ మీడియా వారు మార్వెల్‌ సినిమాటిక్ యూనివర్స్‌ లో ఏ మార్వెల్‌ క్యారెక్టర్‌ ను చేయాలని మీరు అనుకుంటున్నారు అంటూ ఇద్దరు హీరోలను ప్రశ్నించారు.

ఆ సందర్భంగా రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లు స్పందిస్తూ ఐరన్ మ్యాన్ లేదా కెప్టెన్ అమెరికా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. భారతదేశంలో చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారు. వారి యొక్క కథలను మార్వెల్‌ సినిమాలుగా చేయాలని కూడా చరణ్ భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ప్రత్యేక ఆకర్షణగా ఆ వేడుకలో నిలిచారు. అంతర్జాతీయ స్థాయి సెలబ్రెటీలు.. హాలీవుడ్‌ రేంజ్‌ స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా మన ఆర్ఆర్‌ఆర్ టీమ్‌ మెంబర్స్ అత్యంత విభిన్నంగా గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల వేడుక జరిగిన వేదికలో నిలిచారు. మన స్టార్స్‌ తో మాట్లాడించేందుకు అక్కడి మీడియా పోటీ పడింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.