Begin typing your search above and press return to search.

తప్పు చేస్తేనే ఒక పాఠం -తారక్

By:  Tupaki Desk   |   23 Sep 2017 4:58 PM GMT
తప్పు చేస్తేనే ఒక పాఠం -తారక్
X
ఏ పాత్రనైనా ఈజీగా చేసెయ్యగలడు అనే బిరుదును అతి తక్కువ సమయంలో సంపాదించుకున్న హీరోల్లో తారక్ ఒకరు. కానీ తారక్ మాత్రం ఇంకా తాను నేర్చుకునే దశలోనే ఉన్నాను అంటున్నాడు. అంతే కాకుండా ప్రతి సినిమాలోని ప్రతి పాత్ర ఒక పరీక్ష లాంటిది అంటున్నారు. సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలన్నది చాలా కష్టంతో కూడుకున్న పని ఎంతో శ్రమిస్తే గాని స్టార్ హోదాను అందుకోలేరు. ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలి. ఆ తరహా గుర్తింపును జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో తెచ్చుకున్నారు.

రీసెంట్ గా విడుదలైన జై లవకుశ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్బంగా తారక్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు . ఈ విజయం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అలాగే ఇక ముందు కూడా కొత్త తరహా పాత్రలను చేస్తూ ప్రేక్షకులని మెప్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. అలాగే పౌరాణిక పాత్రలను గురించి ప్రస్తావిస్తూ.. మంచి కథలుంటే ఎలాంటి పాత్రలనైనా చేయడానికి చేయడానికి సిద్దమే.. కథల విషయంలో ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు. ఎక్కువగా ఆలోచించకుండా నచ్చితే చేసేస్తా. ఇంతకుముందులా నేను లేను ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. నాకు ఎదురైనా ప్రతి అనుభవంతో ఒక గుణపాఠంగా నేర్చుకున్నా.. వరుస విజయాలు స్ఫూర్తిని ఇస్తాయి. కానీ విజయాలు ఎక్కువ రోజులు ఉండవు. తప్పులు కూడా చెయ్యాలి.. అపుడే ఒక కొత్త పాఠం నేర్చుకుంటామని తారక్ వివరించాడు.

ఇక నిజమైన రావణుడి పాత్ర చేస్తారా అని అడిగితే.. అది అంత ఈజీ కాదు. ఒక వేల చెయ్యాల్సి వస్తే అందుకు తగ్గట్టు కథ.. కథను నడిపించే దర్శకుడు ఉండాల్సిందే అంటున్నాడు. అలాగే ఇప్పటివరకు తనకు వస్తున్న కథలు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మన దర్శకులు - రచయితలు అద్భుతంగా రాస్తున్నారని ఎన్టీఆర్ బదులిచ్చారు.