Begin typing your search above and press return to search.

మళ్లీ డిజప్పాయింట్ చేసిన ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   18 July 2016 10:37 AM IST
మళ్లీ డిజప్పాయింట్ చేసిన ఎన్టీఆర్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ విషయంలో ఫ్యాన్స్ ఇప్పటికే ఓసారి నిరుత్సాహపడ్డారు. ఆగస్ట్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమాని సెప్టెంబర్ 2కి వాయిదా వేయడంతో డిజప్పాయింట్ అయినా.. తర్వాత యూనిట్ నుంచి వచ్చిన క్లారిటీతో సర్దుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి అభిమానులను నిరుత్సాహపరిచాడని అంటున్నారు.

తమ అభిమాన హీరోల పుట్టిన రోజులతో పాటు వారి వారసుల బర్త్ డే నాడు కూడా హడావిడి చేయడం టాలీవుడ్ లో ఆనవాయితీ అయిపోయింది. రకరకాల యాక్టివిటీలతో ఆకట్టుకునేందుకు యత్నిస్తూ ఉంటారు. అలా ఈ నెల 22న ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ పుట్టిన రోజు కావడంతో.. ఆ రోజున పలు కార్యక్రమాలు చేపట్టేందుకు జూనియర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. కానీ అభయ్ రామ్ పుట్టిన రోజున ఎటువంటి ప్రోగ్రామ్స్ వద్దని ఎన్టీఆర్ చెప్పాడట. ఈమేరకు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అధికారికమైన మెసేజ్ ఒకటి ఫ్యాన్స్ కి చేరిందని తెలుస్తోంది.

అభయ్ రామ్ మొదటి పుట్టిన రోజును గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. రెండో బర్త్ డేకి మాత్రం అసలు వేడుకలు వద్దని చెప్పడం ఆశ్చర్యపోయారు. ఎందుకు వద్దంటున్నాడో ఎన్టీఆర్ నుంచి ఎటువంటి క్లారిటీ కూడా రాకపోవడంతో.. ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.