Begin typing your search above and press return to search.
ఆ ‘బ్యాడ్ డే’ని గుర్తు చేసుకున్న ఎన్టీఆర్
By: Tupaki Desk | 19 Dec 2015 10:59 AM GMT2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా నందమూరి అభిమానులతో పాటు సామాన్య జనాలు కూడా ఉలిక్కి పడేలా చేసిన ఘటనను గుర్తు చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రచారంలో పాల్గొని హైదరాబాదుకు వస్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడం.. ఎన్టీఆర్ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరడం.. అతను మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటాడా.. సినిమాల్లో నటిస్తాడా.. డ్యాన్సులు చేయగలుగుతాడా అని అనేక సందేహాలు రేకెత్తడం గుర్తుండే ఉంటుంది. ‘కిమ్స్’ ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ తన జీవితంలో జరిగిన అత్యంత భయానక అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు.
‘‘ప్రమాదం జరిగాక ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో కూడా తెలియలేదు. మూడు పక్కటెముకలు విరిగిపోయాయి. నోటి దగ్గర.. నుదిటి మీద.. ఇంకా బాడీలో చాలా చోట్ల దెబ్బలు తగిలాయి. ఈ రోజు నా అదృష్టం ఏంటంటే కిమ్స్ లో పని చేసే మా ఫ్యామిలీ మెంబర్ అయిన డాక్టర్ నాతో పాటు ఉన్నారు. ఆ సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయనే చెప్పారు. నా దృష్టంతా ముఖం ఎలా మారుతుందో.. సినిమాలకు ఇబ్బందవుతుందేమో అన్నదాని మీదే ఉంది. 120 కిలో మీటర్ల వేగంతో వాహనం నడుపుకుంటూ వచ్చి కిమ్స్ లో చేరాను. సర్జరీలు చేసి నన్ను మామూలు మనిషిని చేశారు’’ అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడు.